Table of Contents
Srinidhi Shetty KGF.. ‘కేజీఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి. కొత్త ఫేస్. కానీ, బోలెడంత ఫేమస్.
ఎంత తొలి సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం మరీ ఇంత ఫాలోయింగా.? శ్రీ నిధి శెట్టికి సంబంధించి అందరిలోనూ ప్రస్తుతం మెదులుతోన్న ప్రశ్న ఇదే ఇప్పుడు.
ఆ క్యూరియాసిటీనే, నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేంతలా అంతకంతకూ శ్రీ నిధి శెట్టికి సోషల్ మీడియాలో అభిమాన గణం పెరిగిపోయేలా చేస్తోంది.
Srinidhi Shetty KGF.. అసలు శ్రీ నిధికి ‘కేజీఎఫ్’ ఛాన్స్ ఎలా వచ్చింది.?
తన సినిమాలో హీరోయిన్‌గా ఓ ఫ్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అప్పటికే మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోంది శ్రీ నిధి శెట్టి.

సోషల్ మీడియాలో శ్రీ నిధి శెట్టి (Srinidhi Shetty) ఫోటోలు చూసి, తన సినిమాలో హీరోయిన్ దొరికేసిందని ఫిక్స్ అయిపోయడట.
నిజానికి శ్రీనిధికి సినిమాల్లో నటించడంపై అంతగా ఆసక్తి లేదట. మోడలింగ్ అంటే చిన్నతనం నుంచీ అమితమైన ఆసక్తి అట శ్రీ నిధి శెట్టికి.
ఆ ఇంట్రెస్ట్‌తోనే పదో తరగతి నుంచే మోడలింగ్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. బోలెడన్ని అవార్డులు. కిరీటాలు దక్కించుకుందట అందాల భామ శ్రీ నిధి శెట్టి.
‘కేజీఎఫ్’ తర్వాత శ్రీ నిధి శెట్టి రేంజ్ వేరే లెవల్..
అదేంటో తెలీదు, ఒక్క సినిమాకే ప్యాన్ ఇండియా రేంజ్ స్టార్‌డమ్ దక్కించుకుంది శ్రీ నిధి శెట్టి. నిజానికి ఈ సినిమాలో నటించడం మొదట ఇష్టం లేదట శ్రీ నిధి శెట్టికి.

కానీ, కన్నడ హీరో యష్ అంటే తనకు ఎంతో అభిమానమట. ఆ విషయం తెలియక మొదట తటపటాయించిందట.
యష్‌కి జోడీ అని తెలియగానే ఎగిరి గంతేసి ‘కేజీఎఫ్’ ఓకే చేసిందట శ్రీ నిధి శెట్టి (Srinidhi Shetty).
‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ హిట్ అవ్వడంతో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. కానీ, ‘కేజీఎఫ్ 2’ కోసం ఆ అవకాశాలన్నింటినీ వదిలేసుకున్నానని చెబుతోంది శ్రీ నిధి శెట్టి.
కెరీర్‌తో పాటు చదువు పైనా ఫోకస్..
మోడలింగ్‌పై అమితమైన ఇంట్రెస్ట్ వున్నా, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు శ్రీ నిధి శెట్టి. ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసింది.
Also Read: శునక యోగం.! రాజసం, వివాదం.! విమానయానం.!
ఇక సినిమాల విషయానికి వస్తే, శ్రీ నిధి శెట్టి ‘కేజీఎఫ్’ చాప్టర్స్‌తో దక్కించుకోవల్సినంత గుర్తింపు, స్టార్‌డమ్ దక్కించేసుకుంది. నిజానికి, ఆమె ఈ స్థాయి సక్సెస్‌ని ఊహించి వుండకపోవచ్చు కూడా.!

ఇక ఆ వచ్చిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు శ్రీ నిధి శెట్టి ముందున్న అతి పెద్ద టాస్క్. మరి, ఈ కన్నడ కస్తూరి తదుపరి తన కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటుంది.? వేచి చూడాల్సిందే.