Srinidhi Shetty Telusu Kada.. శ్రీనిధి శెట్టి..! ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ‘కేజీఎఫ్’ సినిమా పేరు చెబితే చాలు.. ఆమె ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా ఆ సినిమాతో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పేరు మార్మోగిపోయింది.
డెబ్యూ సినిమాకే ఆ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకునే ముద్దుగుమ్మలు చాలా అరుదుగా వుంటారు. అందులో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) పేరు కూడా వుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చేమో.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏరి కోరి శ్రీనిధి శెట్టిని ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంచుకున్నాడంటేనే ఆమెలోని స్పెషాలిటీ ఏంటో అర్ధం చేసుకోవాలి.
Srinidhi Shetty Telusu Kada.. ‘కేజీఎఫ్’ కోసం శ్రీనిధి అంత కమిట్మెంటా.?
తన సినిమాలో హీరోయిన్‌గా ఓ ఫ్రెష్ ఫేస్ కావాలని సెర్చింగ్ మొదలెట్టాడట. అలా ఆయన దృష్టిలో పడింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాకి శ్రీనిధి కూడా అంతే కమిట్మెంట్‌గా వర్క్ చేసింది.
ఈ సినిమా టైమ్‌లోనే ఆమెకు బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులొచ్చాయట. అయితే అవన్నీ సింపుల్‌గా వదిలేసుకుందట శ్రీనిధి. దటీజ్ కమిట్మెంట్ ఆఫ్ శ్రీనిధి శెట్టి.

‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రెండు భాగాల్లోనూ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది. తర్వాత తమిళంలో స్టార్ హీరో విక్రమ్ సరసన నటించింది. అదే ‘కోబ్రా’ మూవీ.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయిందనుకోండి. అయినా శ్రీనిధి శెట్టి అంటే, వరల్డ్ సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’ గుర్తుకు రావల్సిందే ఇప్పటికీ, ఎప్పటికీ.!
మళ్లీ ఇన్నాళ్లకు.. తెలుగులో.!
అంత గుర్తింపు తెచ్చిపెట్టింది ‘కేజీఎఫ్’ శ్రీనిధికి. ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో శ్రీనిధి (Srinidhi Shetty) ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆమె పేరు వినిపిస్తోంది. అదీ తెలుగులో. ‘డీజె టిల్లు(DJ Tillu) ’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా రూపొందుతోన్న ‘తెలుసు కదా’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటిస్తోంది.
స్టైలిష్ట్ నీరజ కోన ఈ సినిమాతో మెగాఫోన్ పట్టబోతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీగా రూపొందుతోన్న ‘తెలుసు కదా (Telusu Kada)’ సినిమా రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది.
Also Read: పూజా హెగ్దే పెళ్ళి గోల.! క్రికెటర్ అంట కదా.!
తెలుగులో శ్రీనిధికి ఇదే స్రెయిట్ మూవీ. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించిన శ్రీనిధి తెలుగులో చాలా మామూలుగా ఓ చిన్న హీరో సినిమాతో డెబ్యూ చేస్తుండడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయినా సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఏం తక్కువోడు కాదండోయ్, సినిమా హిట్ అయ్యిందంటే చాలు, టాలీవుడ్ జనం అస్సలు వదిలి పెట్టరు. అందులోనూ క్రేజీ ఫేసెస్‌ని టాలీవుడ్ మేకర్లు ఇక అసలే చేజార్చుకోరు.!
అలాగే శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కూడా టాలీవుడ్‌లో తిష్ట వేస్తుందేమో చూడాలి మరి. అన్నట్లు ఈ సినిమాలో రాశీఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తుందండోయ్.