Sriya Reddy OG Pawankalyan.. ‘పొగరు’ భామ శ్రియా రెడ్డి పవర్ ఛాన్స్ కొట్టేసిందోచ్.! అదేనండీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో శ్రియా రెడ్డి ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది.
తాజాగా ఈ విషయం చిత్ర యూనిట్ ప్రకటించింది. బుల్లితెరపై వీజేగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రియా రెడ్డి.. విశాల్ హీరోగా వచ్చిన ‘పొగరు’ సినిమాలో నటించింది.
ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన శ్రియా రెడ్డి, తెలుగు జనాలకీ బాగా గుర్తుండిపోయింది ఆ పాత్రతో. అదే ఆమె ఐడెంటిటీ కూడా. ఆ తర్వాత తెలుగులో ఓ స్ర్టెయిట్ మూవీలో నటించింది.
Sriya Reddy OG Pawankalyan.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా..
అదే ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్‌లో కనిపించి మెప్పించింది.

విశాల్ సోదరుడు విక్రమ్‌ని ప్రేమ వివాహం చేసుకుని తమిళనాట సెటిలైపోయింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు శ్రియా రెడ్డి.
లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్యనే ఓటీటీలో సందడి చేసింది శ్రియా రెడ్డి. ‘సుజల్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించి మెప్పించింది.
ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఈ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయ్ శ్రియా రెడ్డికి. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కడంతో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తెలుగు సినీ జనం.
‘సుజల్’ సిరీస్‌తో ఫిదా..
‘ఓజీ’లో శ్రియా రెడ్డికి అవకాశం దక్కడానికి కారణం బహుశా ‘సుజల్’ తెచ్చి పెట్టిన గుర్తింపే కావచ్చు అనినా అతిశయోక్తి కాదేమో.
Also Read: సందీప్ రెడ్డి వంగా ‘ANIMAL’.. తెలుగు హీరో అయ్యుంటేనా.!
అంతలా ఆ పాత్రకు ప్రాణం పోసింది శ్రియా రెడ్డి. ఒకవైపు పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా మరోవైపు ఓ యంగ్ స్టర్‌కి తల్లిగా ఆమె పోషించిన హావ భావాలు మెస్మరైజ్ చేశాయ్ ‘సుజల్’ వెబ్ సిరీస్‌లో.
అందుకే, ఓటీటీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌లో శ్రియా రెడ్డి పర్‌ఫామెన్స్‌కి అంతలా ఫిదా అయిపోయారు.