Sudden Weight Loss Symptoms.. అధిక బరువు సమస్యతో బాధపడేవాళ్లు అనేక మంది. ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
వాకింగ్, వ్యాయామాల వంటివి చేయడంతో పాటూ, కొందరైతే సర్జరీలూ, మెడిసన్స్ అంటూ ఒకింత రిస్కీ అటెంప్ట్స్ కూడా చేస్తుంటారు.
బరువు తక్కువగా వుండడానికి జీన్స్ ఓ కారణం కావచ్చు. అది పెద్దగా సమస్య కాకపోనూ వచ్చు. అయితే, కొన్ని సార్లు అకస్మాత్తుగా బరువు (Sudden WeightLoss) తగ్గిపోతుంటారు.
Sudden Weight Loss Symptoms.. ఒత్తిడి కూడా ఓ కారణమే సుమా.!
అయితే, అధిక బరువే సమస్యా.? బరువు తక్కువగా వుండడం కూడా కొన్నిసార్లు సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాంటి సందర్భాల్లో అస్సలు అశ్రద్ధ చేయరాదనీ అందుకు కారణం తెలుసుకుని తగిన వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడానికి కారణాలేంటీ.?

అకస్మాత్తుగా బరువు తగ్గడానికి గుండె జబ్బులు, క్యాన్సర్ డిమెన్షియా వంటివి కొన్ని సూచనలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.
అందుకే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా, వైద్యుని వద్ద తగు పరీక్షలు చేయించుకుని ఆ అనుమానం తీర్చుకోవడమో లేదంటే, తగు చికిత్సలు చేయించుకోవడమో చేయాలి.
వాళ్ళేదో చెప్పారనీ.. వీళ్ళేదో చెప్పారనీ.. అవీ ఇవీ ఎక్కువ తినేసి.. కొత్త సమస్యలు తెచ్చుకోవడం ప్రమాదకరం. వైద్యుల్ని వీలైనంత త్వరగా సంప్రదించడం చాలా చాలా ఉత్తమం ఇలాంటి సందర్భాల్లో.
Also Read: Black Neck.. మెడ చుట్టూ నలుపు తొలగించుకోవాలంటే.!
అన్నట్టు, తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ కూడా సడెన్ వెయిట్ లాస్ (Sudden WeightLoss) కి ప్రధాన కారణంగా చెబుతున్నారు. హార్మోన్ల నిర్మాణంపై ఒత్తిడి, తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తద్వారా అకస్మాత్తుగా బరువు తగ్గుతారు.
గమనిక: ఈ సంకలనం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు సంబంధిత వైద్య నిపుణుల నుంచి సేకరించిన సమాచారం మరియు ఇంటర్నెట్లో అందుబాటులో వున్న సమాచారం నుంచి సేకరించబడింది.