Swara Bhaskar.. బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి చెప్పాలంటే, ముందుగా.. వివాదాలే కనిపిస్తాయేమో.! వివాదమంటే స్వరా భాస్కర్.. స్వరా భాస్కర్ అంటే వివాదం.!
‘వున్నది వున్నట్లుగానే మాట్లాడతాను.. బహుశా అది కొందరికి నచ్చదు. నేనేమీ వివాదాస్పద వ్యక్తిని కాదు. నిజాలు మాట్లాడితే, అవి జీర్ణించుకోలేనివారికి వివాదాలుగా కనిపిస్తాయ్..’ అని చెబుతుంటుంది స్వరా భాస్కర్.
పెళ్ళంటే.. బోల్డంత హంగామా.! కానీ, అది కొందరికే.!
Mudra369
కోట్లు ఖర్చు చేసి.. నానా హడావిడితో పెళ్ళి చేసుకోవడం ఓ రకం.!
సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని.. అవసరం అనుకున్నప్పుడు దాన్ని బహిర్గతం చేయడం ఇంకో రకం.!
ఎప్పుడూ ఏదో ఒక రకంగా వివాదాలతో వార్తల్లో వుండే స్వరా భాస్కర్.. ఈసారి కాస్త కొత్తగా ట్రై చేసింది.
Swara Bhaskar.. సీక్రెట్ వెడ్డింగ్..
స్వరా భాస్కర్‌కి పెళ్ళయ్యింది.! ఇందులో వింతేముంది.? అనుకుంటున్నారా.? జనవరి 6న ముంబైలో పెళ్ళి జరిగితే, ఇప్పుడు తాపీగా విషయం బయటపడింది.

అది కూడా స్వరా భాస్కర్ నేరుగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి, తన పెళ్ళి విషయాన్ని వెల్లడించాకే అందరికీ తెలిసిందది.
మహారాష్ట్రకి చెందిన ఓ రాజకీయ నాయకుడ్ని ఆమె పెళ్ళాడారు. అతని పేరు ఫహాద్ అహ్మద్. సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర శాఖ యువజన విభాగం అధ్యక్షుడాయన.
సోషల్ మీడియాలో వీడియో..
సోషల్ మీడియా వేదికగా స్వరా భాస్కర్ తన పెళ్ళికి సంబంధించి ఓ వీడియో విడుదల చేసింది. అందులో, రిజిస్టర్ మ్యారేజ్.. సంబంధిత ధృవ పత్రాల్ని కూడా చూపించింది.

‘మనం కొన్నిసార్లు మన పక్కన వున్నదాని కోసం ఎక్కడో దూరంగా వెతుకుతాం. మేం స్నేహితులుగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం..’ అని తన ప్రేమ కథ గురించి చెప్పింది స్వరా భాస్కర్.
Also Read: Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ.. ఓ స్వచ్ఛమైన ప్రేమికుడు.?
‘అర్థం చేసుకుని, ఆ తర్వాత ప్రేమలో పడ్డాం.. పెళ్ళి చేసుకుని, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాం..’ అని స్వరా భాస్కర్.. తమ పెళ్ళి విషయాన్ని వివరించింది.