Home » గ్లామర్ టచ్.! అప్పట్లో తాప్సీ అమాయకత్వమలా వుండేది.!

గ్లామర్ టచ్.! అప్పట్లో తాప్సీ అమాయకత్వమలా వుండేది.!

by hellomudra
0 comments
Taapsee Pannu

Taapsee Pannu Hot Innocence.. నటి తాప్సీ తెలుసు కదా.? అలా ఎలా మర్చిపోగలం.? పలు తెలుగు సినిమాల్లో నటించింది.

గ్లామర్ తప్ప, నటనతో తాప్సీ ఏనాడూ ఆకట్టుకున్నది లేదు తెలుగు సినిమాల వరకు. బాలీవుడ్‌కి వెళ్ళాక మాత్రం తాప్సీ, నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది.

కత్రినా కైఫ్ తెలుసు కదా.? ఆమె కూడా అంతే. తెలుగులో కత్రినా కైఫ్, కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. నటన పరంగా గుండు సున్నా.!

బాలీవుడ్‌లో కత్రినా కైఫ్ కూడా, నటిగా సత్తా చాటింది. మరీ ముఖ్యంగా కత్రినా కైఫ్ డాన్సులు.. అదీ, బాలీవుడ్‌కి వెళ్ళాక.. అది వేరే లెవల్ అంతే.!

Taapsee Pannu Hot Innocence.. అప్పుడు మురిసిపోయి.. ఇప్పుడు బురదజల్లేస్తోంది..

తాప్సీ విషయానికొస్తే, గతంలో గ్లామరస్ పాత్రలు చేసినప్పుడు, తన గ్లామర్ వెండితెరపై చూసుకుని తానే మురిసిపోయింది. గ్లామరస్ పాత్రలంటే భలే ఇష్టమని చెప్పుకొచ్చింది.

ఏమయ్యిందోగానీ, అప్పట్లో వెండితెరపై గ్లామర్ ఒలకబోసేసిన వైనం గురించి తన మీద తానే సెటైర్లు వేసుకుంటోంది. కాదు కాదు, తనను అలా చూపించిన దర్శక నిర్మాతల్ని తూలనాడుతోంది.

ప్యాడెడ్ బ్రా వేసుకోవాల్సిందిగా తన మీద ఒత్తిడి తెచ్చేవారనీ, అది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని ఓ ఇంటర్వ్యూలో తాజాగా సెలవిచ్చింది.

సినిమా అంటేనే గ్లామర్.! ఇదొక మాయా ప్రపంచం. లేనిది వున్నట్లు, వున్నది లేనట్లు చూపిస్తుంటుంది సినిమా.!

అలా, గ్లామర్ కోసం, కొందరు దర్శకులు హీరోయిన్ నాభి మీద పళ్ళను విసురేలా సన్నివేశాల్ని డిజైన్ చేస్తుంటారు. ఇంకా చాలా చాలా జరుగుతుంటాయ్.

లిప్ లాక్స్.. అప్పుడూ.. ఇప్పుడూ..

లిప్ లాక్ సీన్స్ అంటే, ఒకప్పుడు వెరేలా చిత్రీకరించారు.. సాంకేతికత సాయంతో. ఇప్పుడైతే, డైరెక్ట్.. అస్సలేమాత్రం ఫిల్టర్ లేకుండా పని కానిచ్చేస్తున్నారు.

ఇవన్నీ తాప్సీకి తెలియని విషయాలా.? బాలీవుడ్‌లో కూడా చాలీచాలని దుస్తుల్లో గ్లామర్ ఒకలబోసేసింది తాప్సీ. బికినీలోనూ అందాల విందు చేసింది.

వృద్ధ నారీ పతివ్రత.. అనే సామెత తరచూ వాడుతుంటారు పెద్దలు. అలా తయారైందిప్పుడు తాప్సీ వ్యవహారం. ప్యాడెడ్ బ్రా విషయంలో అప్పట్లోనే తాప్సీ, దర్శక నిర్మాతల్ని నిలదీసి వుండాలి.

అప్పుడేమీ తాప్సీ వయసు ఐదారేళ్ళు కాదు కదా.. వయసు పరంగా మేజరే కదా.! నిలదీసి వుంటే బావుండేది కదా.! ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్ అన్నమాట.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group