హీరోలకైనా, హీరోయిన్లకైనా.. మీడియా నుంచి పరమ రొటీన్‌గా వచ్చే ప్రశ్న ‘పెళ్ళెప్పుడు.?’ అనే.! మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఇందుకు మినహాయింపేమీ కాదు.
తమన్నా భాటియా.! పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది, ఇప్పుడు ఓ మోస్తరు స్టార్‌డమ్ కొనసాగిస్తోంది.
తమిళ, హిందీ సినిమాల్లోనూ తమన్నా నటించింది, నటిస్తూనే వుంది. తమన్నా వయసు జస్ట్ 32 ఏళ్ళు మాత్రమే.!
ఒకప్పుడు పరిస్థితులు వేరు. హీరోయిన్‌కి పాతికేళ్ళు వస్తే, ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు దక్కేవి కావు. ఇప్పుడు ఫార్టీ ప్లస్ అయినా, హీరోయిన్‌గా చెలామణీ అయిపోతున్నారు.
Tamannaah Bhatia.. పెళ్ళి చేసుకుంటే తప్పేంటి.?
సో, తమన్నాకి ఇంకా చాలా కెరీర్ వుందన్నమాట. పెళ్ళి చేసుకున్నాక కూడా సినిమాలు చేయొచ్చు. నయనతార, కాజల్.. ఆ కోవలోకే వస్తారు.

తమన్నా మాత్రం పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు.? ఏమో, ఆమెకు నచ్చినోడు దొరికితే.. పెళ్ళి గురించిన ప్రకటన చేసేస్తుందేమో.!
కొందరికి ఆత్రం ఆగదు కదా.! అదిగో తమన్నా పెళ్ళంట, ఇదిగో తమన్నాకి కాబోయే మొగుడంట.. అంటూ ఏవేవో ఊహాగానాలు ప్రచారంలోకి తెస్తూనే వుంటారు.
ఇదిగో తమన్నాకి కాబోయే భర్త..
తాజాగా, తమన్నా తాను పెళ్ళాడబోయే బిజినెస్‌మేన్.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ సెటైరేసింది. ‘ఎఫ్3’ సినిమాలోని తన ‘మేల్’ గెటప్పునే తమన్నా అలా ప్రెజెంట్ చేసింది.
Also Read: వ్యూహం.! శపథం.! ఆర్జీవీ మార్కు సినీ భ్రష్టత్వం.!
దటీజ్ తమన్నా.. అనాలా.? అనుకోవాల్సిందే.! పెళ్ళి చేసుకునే టైమొస్తే, అది దాచే విషయం కాదు కదా.? అంగరంగ వైభవంగా సెలబ్రిటీల పెళ్ళిళ్ళు జరుగుతాయ్.!