Table of Contents
Tamannah Jee Karda.. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన వెబ్ సిరీస్ ఒకటి ప్రస్తుతం ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోంది. వెబ్ కంటెంట్ అంటే తెలిసిందేగా.! నో సెన్సార్. అడల్ట్ సీన్లలో ఆర్టిస్టులు విచ్చలవిడిగా నటించేస్తుంటారు. అయితే, తమన్నాలాంటి సీనియర్ స్టార్ హీరోయిన్‌కి అది అవసరమా.?
‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో తమన్నా భాటియా చాలా ఇంటిమేట్ సీన్లలో నటించేసింది. ఓకే వెబ్ కంటెంట్ అంటే అలాంటి సన్నివేశాలు తప్పవులే అని సరిపెట్టుకోవచ్చు.
మరీ జంగల్.. వేక్స్.. అంటూ కొన్ని వల్గర్ డైలాగులు అలవోకగా చేప్పేసింది. అదే ఇప్పుడు తమన్నాపై ఇంప్రెషన్ పోయేలా చేస్తోంది.
Tamannah Jee Karda.. నీకిది అవసరమా.?
తమన్నా( Tamannah Bhatia )ది మరీ ఇంత చీప్ క్యారెక్టరా.? అని ముక్కున వేలేసుకుంటున్నారు. పోనీ.. అదే పోనీ.! నటి అన్నాకా ఎలాంటి పాత్రలయినా చేయాలి.

అయితే, ఆ వల్గర్ లాంగ్వేజ్ వల్ల నటిగా తమన్నాకి ఒరిగిందేంటట.? నిజానికి ఆ వెబ్ సిరీస్‌లో అలాంటి సన్నివేశాలు లేకపోయినా నష్టమేమీ లేదు.
అలాంటప్పుడు తమన్నా ఇంత దిగజారిపోవాల్సిన అవసరమేంటీ.? ఇంకో సన్నివేశంలో ఓ పక్క పెళ్లి తంతు పడుస్తుండగా, కాబోయే భర్తతో చిన్న గొడవ.
ఛి ఛీ.! ఓ పక్క పెళ్లి తంతు.. ఇంకో పక్క భంచిక్.!
అంతలోనే మరోవైపు స్నేహితుడితో భంఛిక్ (పని పూర్తయిపోద్ది). ఏమీ ఎరగనట్లుగా వచ్చి పెళ్లి చేసేసుకుంటుంది. తర్వాత భర్తతో హనీమూన్‌కి వెళ్లిపోతుంది.

దిగజారుడుతనంలో ఇది వేరే లెవల్ అనాలా.? కొన్నిసార్లు దర్శకులు దిక్కుమాలిన పాత్రల్నీ, అంతకన్నా దిక్కు మాలిన సన్నివేశాల్నీ రాస్తుంటారు.
స్టార్‌డమ్‌నీ, సీనియారిటీని గాలికొదిలేసిందా.?
కానీ, ఆర్టిస్టులకు కాస్తయినా బుర్ర, బుద్ధీ వుండాలిగా. అందులోనూ తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు కాస్తయినా ఇంగితం ప్రదర్శించాలి కదా.!
Also Read: పూజా హెగ్దే కళ్ళల్లో శ్రీలీల, సంయుక్త.. ‘గుంటూరు కారం’ .!
తమన్నాకి అవకాశాలు కరువా.? అందుకే ఇంతలా దిగజారిపోయిందా.? అనే ప్రశ్న వస్తోంది ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే వుందిగా ‘భోళా శంకర్’ రూపంలో.

ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. అలాంటప్పుడు ఇదేం ఖర్మ తమన్నా( Tamannah Bhatia )కి ఇంతలా బరి తెగించి నటించడానికి.! ఇదీ ప్రస్తుతం ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో తమన్నా పాత్రపై జరుగుతోన్న విమర్శల రచ్చ.
అయితే, తమన్నా మాత్రం అందులో తప్పేముంది.? అని బుకాయిస్తోంది. అంతేనా.! అర్ధ పర్ధం లేని ఆ వల్గారిటీని తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay Varma) కూడా వెనకేసుకొస్తుండడం నెటిజనాన్ని మరింత విస్మయానికి గురి చేస్తోంది.