Tammareddy Bharadwaj Pawan Kalyan.. తెలుగు సినీ పరిశ్రమలో ‘పెద్దలు’ అనదగ్గరవారిలో తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఒకరు. వయసు పరంగానే సుమీ.! అంటారు చాలామంది.
ఆయన కేవలం సినిమా మనిషే కాదు, రాజకీయాల గురించీ మాట్లాడుతుంటారు. సరే, దేశంలో ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడొచ్చు.. దాన్ని తప్పు పట్టలేం.
కాకపోతే, సాటి సినీ కళాకారుడి పట్ల తమ్మారెడ్డి భరద్వాజకి ఎందుకంత అక్కసు.? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్‌ని నిలదీస్తే, తమ్మరెడ్డికి ఒరిగేదేంటి.?
Tammareddy Bharadwaj Pawan kalyan.. ఏం సాధిద్దామని.?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదాపై నిలదీస్తే ఉపయోగముంటుంది.? ప్రతిపక్ష నేతను ఈ విషయమై ప్రశిస్తే కాస్తో కూస్తో ఉపయోగముంటుంది.
యూ ట్యూబ్‌లో కూసే కూతలకి అంత విలువ వుందనుకుంటే.. పరిశ్రమ పెద్దవే కదా.. సినీ ప్రముఖుడివి కూడా కదా.! జనంలోకి వెళ్ళి, ఆ జనాన్ని చైతన్యవంతుల్ని చేసెయ్.!
పవన్ కళ్యాణ్ చేసేవన్నీ తప్పులే అయితే.. ఆయన కోసం స్వచ్ఛందంగా అభిమానులైనా, జనం అయినా ఎందుకొస్తారన్న ఇంగితం కూడా లేనోడివి మేధావివెలా అయ్యావ్.?
Mudra369
కానీ, చట్ట సభల్లో అసలు ప్రాతినిథ్యమే లేని పవన్ కళ్యాణ్‌ని తమ్మారెడ్డి ప్రశ్నించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
పెద్దరికానికి పాతరేసుకుంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కళ్యాణ్ సంపాదన, పిల్లల చదువులు.. ఇవన్నీ తమ్మారెడ్డి భరద్వాజకి ఎందుకు.? ప్రజలకెందుకు.?
యూ ట్యూబ్ అందుకే వుందా.?
కృష్ణా.. రామా.. అంటూ కాలక్షేపం చేసుకోవాల్సిన సమయంలో, ఎవరితోనో తమ్మారెడ్డి భరద్వాజ ఎందుకు తిట్టించుకోవాలి.? ఆ మాత్రం ఇంగితమే ఆయనకు వుంటే.. ఆయనిలా మాట్లాడరేమో అన్నది ఓ వాదన.
సరే, మాట్లాడటం తప్పు కాదు.! అభిప్రాయాల్ని పంచుకునే స్వేచ్ఛ కూడా ఆయనకి వుంది. కానీ, అధికారంలో వున్నోళ్ళని ప్రశ్నిస్తే అర్థముంటుంది.. అధికారానికి ఆమడదూరంలో వున్నవారిని ప్రశ్నించి.. ఏం సాధిద్దామని.?
ఏదో అక్కసు తమ్మారెడ్డి భరద్వాజతో ఇలా మాట్లాడిస్తోందన్నదైతే నిర్వివాదాంశం. అదేంటి.?
రాజకీయాల్లో ఓ మంచి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. డబ్బుమయమైపోయిన రాజకీయాల్లో గుండె ధైర్యంతో నిలబడుతున్నాడాయన.
Also Read: వయస్కాంతం: 50 వర్సెస్ 70.! ఎవరు పెద్ద తోపు.?
అలాంటి పవన్ కళ్యాణ్‌ని కాళ్ళు పట్టి కిందికి లాగేసే ప్రయత్నం చేస్తున్నవారి లిస్టులో తమ్మారెడ్డి ఎందుకు చేరిపోతున్నారో ఏమో.!
రాజకీయాల్లో నిలబడి.. ఓ పదవి పొంది.. ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయలేకపోతే.. అప్పుడు కదా పవన్ కళ్యాణ్‌ని నిలదీయాల్సింది.?
ఏ పదవీ లేకుండానే, సినీ రంగంలో తాను సంపాదించిన సంపాదనతో.. కౌలు రైతుల్ని ఆదుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇంతకన్నా సేవ ఇంకేముంటుంది.?