Taraka Ratna Health Bulletin.. నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే వుంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మీదనే వైద్య చికిత్స అందిస్తున్నారు బెంగళూరు నారాయణ ఆసుపత్రి వైద్యులు.
నిన్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తారక రత్న కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశారు.
చికిత్సకు తారక రత్న స్పందిస్తున్నాడనీ, ఓ సారి కళ్ళు కుదిపాడనీ, గిచ్చితే స్పందించాడనీ బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Taraka Ratna Health Bulletin.. వెంటిలేటర్ మీదనా.? ఎక్మో మీదనా.?
వెంటిలేటర్ కంటే అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్‌గా ‘ఎక్మో’ గురించి చెప్పుకోవచ్చు. ఎక్మో మీద తారక రత్నను వుంచినట్లు వార్తలొచ్చాయి. ఎన్టీయార్ మాత్ర అదేమీ లేదంటున్నాడు.
ఇదిలా వుంటే, నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 48 గంటల అబ్జర్వేషన్ నటి ఉదయంతో పూర్తయ్యింది. తదుపరి వైద్య పరీక్షలు, హెల్త్ అప్డేట్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సమయం పెరుగుతున్న కొద్దీ అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇంకోపక్క రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
Also Read: ‘పవిత్ర’ నరేషూ.! ఓ సుపారీ.! నువ్వు కూడానా.?
తీవ్ర గుండెపోటు వచ్చాక 45 నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. ఆ తర్వాత అద్భుతం జరిగింది.. అంటోన్న బాలయ్య అండ్ కో మాటలు కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి.
ఎందుకిదంతా.?
తారక రత్న అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనీ, అంతర్గత రక్త స్రావం ఎక్కువగా జరుగుతోందంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఇంకోపక్క, గుండె పోటు తదనంతరం బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ‘ఎక్కువ డ్యామేజీ అయి వుండకపోవచ్చు..’ అని బాలయ్య చెబుతున్నారు.
మరోపక్క, వైద్య నిపుణులు.. వచ్చిన గుండె పోటు తీవ్రత తదితర అంశాలపై విశ్లేషిస్తూ, బ్రెయిన్ డ్యామేజీ ఎక్కువగానే జరిగి వుండొచ్చని అంటున్నారు.
రకరకాల మీడియా కథనాలు, విశ్లేషణలు, వాటిల్లో వైద్య నిపుణుల అంచనాలు.. ఇవన్నీ తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచేస్తున్నాయి.
కాగా, తారక రత్న సేఫ్.. ఔటాఫ్ డేంజర్.. అంటూ ఓ ప్రచారం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఇదే విషయాన్ని ధృవీకరిస్తారా.? వేచి చూడాల్సిందే.