Tegulu Media Eenadu Sakshi.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావుకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వైసీపీకీ ఈనాడుకీ.. అంటే, సాక్షికీ ఈనాడుకీ అనే కదా అర్థం.!
ఇవేవీ కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ రామోజీరావు.. అనుకోవచ్చు.! అంతేనా.? ఎవరైనా ఎలాగైనా అనుకోండి.! అసలు విషయమేంటంటే, సాక్షి పత్రిక అలవోకగా రామోజీరావు బట్టలూడదీసింది. నిజంగా కాదు లెండి, కార్టూన్ రూపంలో.!
అసలు ఇలా చేయొచ్చా.? రామోజీరావు అంటే మీడియా మొఘల్.! అలాంటి రామోజీరావు కార్టూన్‌ని నగ్నంగా ఎలా సాక్షిలో ప్రచురిస్తారు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
కానీ, కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, స్వర్గీయ ఎన్టీయార్ బట్టలూడదీసింది ఈనాడు అప్పట్లో.! స్వర్గీయ ఎన్టీయార్ అంటే, అప్పట్లో తెలుగు సినీ అభిమానులు దేవుడిగా కొలిచిన అన్నగారు.! తెలుగునాట అప్పట్లో ఎన్టీయార్ అంటే.. ఓ శక్తి.
Tegulu Media Eenadu Sakshi.. ఇంతలా దిగజారిపోవాలా.?
సరే, రాజకీయాల్లోకి వస్తే ఏమైనా అంటాం.. ఇది భావప్రకటనా స్వేచ్ఛ.. అంటే, అది మళ్ళీ వేరే చర్చ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నట్టు, రామోజీరావు గతంలో ఎన్టీయార్ గుడ్డలూడదీసి కార్టూన్లు వేస్తే, ఇప్పుడు రామోజీరావు గుడ్డలూడదీశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనుకోవాలన్నమాట.
వాట్ నెక్స్‌ట్.? ఇంకేముంది.? ఈనాడులో, సాక్షి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్డలూడదీయడమే.! వైఎస్ జగన్ విషయంలో చేస్తే.. ఏమో, ఆ వ్యవహారమెలా వుంటుందో.! ఇంకాస్త దిగజారి, వైఎస్ జగన్ సతీమణి భారతి జోలికి వెళితేనో.! సాక్షి వ్యవహారాలు ఇప్పుడు ఆమే చూసుకుంటున్నారు కదా మరి.!
Also Read: ఎకరం వెయ్యి కోట్లు! నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ!
మీడియా ఏ స్థాయికి అయినా దిగజారిపోతుంది తెలుగునాట.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ విషయాన్నే ఇప్పుడు సాక్షి నిరూపించింది. గతంలోనే ఈనాడు నిరూపించేసిందనుకోండి.. అది వేరే సంగతి. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.!
చివరగా.. వ్యక్తిగతంగా రామోజీరావుకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ ఏమైనా గొడవలుంటే.. పరస్పరం ప్రైవేటు ప్రాంతంలో తలపడండి.! ఆ తర్వాత ఏమైనా జరగనీయండి.!
అంతేగానీ, మీ వ్యక్తిగత గొడవల్ని జనాల మీద బలవంతంగా రుద్దొద్దు. మీడియాలో కార్టూన్లు అయినా, నగ్నత్వం సబబు కాదు.! కడుపుకి అన్నమే తింటున్నారా.? అశుద్ధం తింటున్నారా.? అని జనం, మీడియా సంస్థల్నిగానీ, రాజకీయ నాయకుల్నిగానీ నిలదీసే పరిస్థితిని కొనితెచ్చుకోవద్దు.!