Telugu Prank Stars.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. తన సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ స్టార్ సాయం తీసుకున్నాడు. దానిపై నానా యాగీ జరిగింది.
ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్, ఈ వ్యవహారంలో వేలు దూర్చి, రచ్చ చేసి.. మొత్తానికి మాస్ కా దాస్‌కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది.. ఈ మొత్తం వ్యవహారంతో.
అసలు ఎవరీ ప్రాంక్ స్టార్స్.? రోడ్డు మీద మీరు ఏదో పని మీద అలా నడిచి వెళుతోంటే, అపరిచిత వ్యక్తులొచ్చి.. మీతో మాట్లాడతారు, మిమ్మల్ని భయపెడతారు.. ఏవేవో చేస్తారు.
చివరికి అదంతా ‘ఉత్తుత్తినే’ అంటారు. అదే ప్రాంక్.! అలా చేసేవాళ్ళే ప్రాంక్ స్టార్స్.!
Telugu Prank Stars.. ప్రాంక్ కాదు.. పైత్యం.!
యూ ట్యూబ్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ ప్రాంక్ స్టార్లకు డిమాండ్ పెరిగిపోయింది. సినిమా స్టార్స్, టీడీ స్టార్స్ తరహాలో ప్రాంక్ స్టార్లు కూడానన్నమాట.
‘ప్రాంక్’ పేరుతో ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే, యూ ట్యూబ్‌కి సెన్సార్ లేదు గనుక.! కానీ, ప్రాంక్ వ్యవహారాలపై తరచూ పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటారు. ప్రాంక్ చేయబోయి, ఆయా స్టార్లు జనం చేతుల్లో తన్నులు తిన్న సందర్భాలూ లేకపోలేదు.

అందుకే, జనంలోకి వెళ్ళి ‘ప్రాంక్’ వ్యవహారాలు నడపడం కంటే, కొందరు ప్రాంక్ స్టార్లు కలిసి, అసభ్యకరమైన వీడియోలు రూపొందించడం మొదలు పెట్టారు.
సినీ నటి కరాటే కళ్యాణి ఉదంతంతో, శ్రీకాంత్ రెడ్డి అనే ప్రాంక్ స్టార్ ఉదంతం తెరపైకొచ్చింది. పచ్చి బూతు, అంతకు మించిన అసభ్యత ఆ శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోల్లో కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది.
ప్రాంక్.. చిన్న రగడ కాదు.. ఇదొక మాఫియా.!
చిత్రమేంటంటే, కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి గొడవలో, కరాటే కళ్యాణి మీద కేసులు నమోదైతే, సినీ నటి అయిన ఆమెపై నెగెటివ్ ఇంపాక్ట్ పడింది.. శ్రీనివాస్ రెడ్డి పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. ఇదీ, ఇలా తయారైంది వ్యవహారం.
ప్రాంక్ అంటే, చిన్న వ్యవహారమనుకునేరు. ఇదో పెద్ద వ్యవహారం. ‘మాఫియా’ అనేది చాలా చిన్న మాటే. కానీ, చాలామంది యువత పొట్ట నింపుతోంది ఈ ప్రాంక్.
Also Read: నిత్యానంద కైలాసం.! సమాధిలో అయ్యోరి సయ్యాట.!
చేసుకున్నోడికి చేసుకునన్నంత, చూసుకున్నోడికి చూసుకున్నంత.. భరించినోడికి భరించినంత ఈ ప్రాంక్ వ్యవహారం. షార్ట్ ఫిలింస్, షార్ట్ రీల్స్.. ఇదిగో ప్రాంక్ వీడియోలు.. ఏదైనాగానీ, ఆ బూతే, వాళ్ళకి భవిష్యత్తు.!
సినిమాల్లో నటీనటులు కామెడీ పేరుతోనో, రొమాన్స్ పేరుతోనో అసభ్యత చూపిస్తే తప్పు లేదా.? మేం చేస్తే తప్పా.? అని శ్రీకాంత్ రెడ్డి లాంటి ప్రాంక్ స్టార్లు సంధిస్తున్న ప్రశ్నలోనూ వాస్తవం లేకపోలేదు.
ఔను, బరితెగింపు అన్ని చోట్లా వుంది. దానికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే వ్యవహారమే కాదు.!