Thalapathy Vijay Telangana KCR ప్రముఖ తమిళ సినీ నటుడు ‘దళపతి’ విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఎందుకు కలిశారు.?
ఈ ప్రశ్న చుట్టూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఓ ముఖ్యమంత్రిని ఓ సినీ నటుడు మర్యాద పూర్వకంగా కలిశాడు.. అన్న కోణంలో చూస్తే, ఇదసలు పెద్ద వార్తే కాదు.! కానీ, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పేరు తరచూ వినిపిస్తుంటుంది.
రాజకీయాల్లోకి విజయ్ రాబోతున్నాడన్న ప్రచారం ఈనాటిది కాదు. ఆ తమిళనాడుతో రాజకీయంగా సత్సంబంధాల్ని తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కోరుకుంటోందా.? అన్న కోణంలో చూస్తేనే ‘రచ్చ’కు ఆస్కారముంది.
Thalapathy Vijay Telangana KCR.. తమిళ – తెలంగాణ రాజకీయమేంటి.?
తమిళనాడుకి చెందిన తమిళిసై సౌందరాజన్ తెలంగాణ గవర్నర్‌గా వున్నారు. ఆ గవర్నర్‌తో తెలంగాణ రాష్ట్ర సమితికి పొసగడంలేదు.
దాంతో, తమిళులంతా, తెలంగాణ రాష్ట్ర సమితిపై గుర్రుగా వున్నారట. అలాగని ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అధినేత ‘గుండె తెరచి దుష్ప్రచారం’ చేసిన సంగతి తెలిసిందే.
అందుకే కేసీయార్, తమిళ హీరోని రంగంలోకి దించారన్నది ఓ వింత వాదన. అలా చేస్తే తెలంగాణలో సెటిలైన తమిళులంతా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతుగా నిలుస్తారని విశ్లేషించగలమా.?
జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్, దళపతి విజయ్ సాయాన్ని తమిళనాడులో తీసుకుంటారా.? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

రాజకీయం అన్నాక, ఇలాంటి స్పెక్స్యులేషన్స్‌కి కొదవేముంటుంది.? అడపా దడపా తన సినిమాలతో ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లేయడం విజయ్‌కి వెన్నతో పెట్టిన విద్య.
సో, రాజకీయంగా విజయ్ కెలుకుడు వ్యవహారాలు చేస్తూనే వుంటాడు. కానీ, ఆ రాజకీయాలతో తనకు సంబంధం లేదంటాడు. ఈ విషయంలో విజయ్ తీరు ఎవరికీ అర్థం కాదు.
రాజకీయం లేనిదెక్కడ.?
అందుకే, విజయ్ అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రాజకీయంగా చర్చోపచర్చలకు ఆస్కారమిచ్చింది.
తెలుగు దర్శకుడు వంశీపైడిపల్లి రూపొందిస్తోన్న ఓ సినిమాలో (దీన్ని ద్విభాషా చిత్రంగా, పాన్ ఇండియా సినిమాగా చెబుతున్నారు) విజయ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: సినీ మాయ: ‘టిక్కెట్టు’ సెగ తగిలింది.! దెబ్బకి దిగొచ్చింది.!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని విజయ్ కలిసినప్పుడు, ఆ భేటీకి వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) కూడా హాజరయ్యాడు. సో, ఇది జస్ట్ మర్యాద పూర్వక భేటీ అనుకోవాల్సిందే.
ఇక, ఊహాగానాల సంగతేంటంటారా.? అవి లేకుండా రాజకీయాలెలా వుంటాయ్.! సినిమాల్నీ, రాజకీయాల్నీ విడదీస చూడలేం ఈ రోజుల్లో.!