The Raja Saab Review.. అసలు మారుతి దర్శకత్వంలో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి.. నాన్సెన్స్.!
ఇదీ చాలామంది, ‘ది రాజా సాబ్’ సినిమా అనౌన్స్‌మెంట్ నేపథ్యంలో చేసిన కామెంట్స్ తాలూకు సారాంశం.
ఏమో, ఎవరిలో ఎలాంటి టాలెంట్ అంతర్లీనంగా దాగుందో.. అని ఇంకొందరు అనుకున్నారు. ప్రభాస్ అంత తేలిగ్గా, ఛాన్స్ ఇచ్చి వుండడు.. అని ప్రభాస్ అభిమానుల్లోనూ కొందరు భావించారు.
కట్ చేస్తే, సినిమా ప్రారంభమై, పూర్తయిపోయి, ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్.. అంటూ, ‘ది రాజా సాబ్’ గురించిన ప్రచారం జరిగింది.
ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.! ఏం లాభం.? ట్రైలర్‌కి సరైన బజ్ క్రియేట్ కాలేదు. పాటలు సైతం, సోసోగా వున్నాయంతే.!
The Raja Saab Review.. బొమ్మ పడింది.. దిమ్మ తిరిగింది..
థియేటర్లలో బొమ్మ పడ్డాక పరిస్థితి ఏంటి.? బొమ్మ పడ్డానికి కొద్ది గంటల ముందు పరిస్థితులు ఏంటి.? అంటే, టిక్కెట్ హైక్ అన్నారు.. అదీ కుదరలేదు.. ప్రీమియర్స్ పడిపోయాయి.
ప్రీమియర్స్ ఎలా పడ్డాయి.? ఫ్యాన్స్ నరకం చూశాక పడ్డాయ్.! చిరాకొచ్చేసింది అభిమానులకే. అంత చిరాకులోనూ, ఓపిక చేసుకుని థియేటర్లలోకి ప్రభాస్ అభిమానులు అడుగు పెట్టారు.
తెరపై, ప్రభాస్‌ని చూడగానే అప్పటిదాకా పడ్డ కష్టమంతా మర్చిపోాయారు.! ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్’ అంటూ నినదించారు.
కాస్సేపటికి సీన్ మారింది. అభిమానుల సందడి తగ్గింది. ఇంటర్వెల్ సమయానికి కాస్త ఊపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అదీ కాస్సేపు కూడా నిలబడలేదు.
సినిమా పూర్తయ్యింది.. థియేటర్ల నుంచి బయటకు వస్తూనే, దర్శకుడు మారుతిని మీడియా సాక్షిగా బూతులు తిట్టేశారు ప్రభాస్ అభిమానులు.!
ఇంతకీ, థియేటర్ లోపల, స్క్రీన్ మీద బొమ్మ పరిస్థితి ఏంటి.? కథా కమామిషు ఏంటి.? అంటే, అదో పెద్ద కథ.! మూడు గంటల పాటు సాగిన నస.!
హీరోయిన్లు ముగ్గురూ పోటీ పడి అందాల ప్రదర్శన చేశారు. మాళవిక మోహనన్ అయితే ఓ ఫైట్ కూడా చేసేసింది. ప్చ్.. ఏదీ, సినిమాకి ప్లస్ అవలేదు.
హీరో ప్రభాస్, తెర మీద బావున్నాడు. కొన్ని మాస్ ఎలివేషన్స్ ప్రభాస్ మీద బాగానే వర్కవుట్ అయ్యాయని అప్పటికప్పుడు అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత అదంతా అనవసరం అనిపిస్తుంది.
నటీనటుల్లో ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. కానీ, అవీ తేలిపోయాయి.
తమన్ సంగీతం కూడా చిరాకు పుట్టించేసిందంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదంతే. ఎడిటింగ్ అడ్డగోలుగా తయారైంది. నిర్మాణపు విలువల పరంగా చూస్తే, ఖర్చు విచ్చలవిడిగా చేసేశారు. ఔట్‌పుట్ మాత్రం నాసిరకం.
దెయ్యాల కొంప.. బూత్ బంగ్లా.. ఈ కాన్సెప్టులతో బోల్డన్ని సినిమాలు వచ్చాయ్. కొత్తగా ఏముంది ఇందులో.? ఏమీ లేదు.! సంజయ్ దత్ కూడా వృధా అయ్యాడు సినిమాలో.
కాంబినేషన్ సెట్ అయ్యింది.. తన దశ తిరిగింది.. అనుకున్నాడంతే దర్శకుడు మారుతి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, పెద్దగా వర్క్ చేసినట్లు లేడు.
ప్రభాస్ కూడా, ‘ఇది నా సినిమా’ అనుకోలేదు.! దర్శకుడేదో చెప్పాడు, చేసుకుంటూ పోయాడంతే.! హీరోయిన్లూ అంతే, చెప్పింది చేసుకుంటూ పోయారు.! ‘విప్పుకుంటూ పోయారు’ అనడం సభ్యతగా వుండదుగానీ.. అదే చేశారు.
సంక్రాంతికి పండగలా వుండాల్సిన సినిమా, దండగలా తయారైంది.! అసలు ప్రభాస్‌తో చెయ్యాల్సిన సినిమా కాదిది. ప్రభాస్ చేయాల్సిన సినిమా అసలే కాదిది.
భయమూ లేదు, కామెడీ లేదు, అద్భుతాలూ లేవు.. ది రాజా సాబ్ జస్ట్ నాన్సెన్స్ అంతే.!
