Table of Contents
Mermaid జలకన్య.. మత్స్య కన్య.. మనిషి, మత్స్యం రెండూ చెరి సగం. అదేనండీ సగం మనిషి, సగం చేప. ఈ ఆకారాన్ని సినిమాల్లో చూసే ఉంటాం. వెంకటేష్ హీరోగా నటించిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాలో శిల్పాశెట్టి పోషించిన పాత్ర ఇలాంటిదే.
మెర్మైడ్ లేదా మత్స్య కన్య లేదా జలకన్య. మనిషి రూపంలో ఉన్న చేప లేదా చేప రూపంలో ఉన్న మనిషి.. ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఇంతకీ ఇది నిజమా.? కాదా.?
Mermaid జలకన్య.. మత్స్య కన్య.. మత్స్యం రూపంలో మనిషి.. నిజమేనా.?
చరిత్రలోకి తొంగి చూస్తే, క్రిష్టోఫర్ కొలంబస్, హిస్పానియోలా సముద్ర తీరప్రాంతంలో 1493లో మనిషి, మత్స్యం కలగలిసిన ఓ రూపాన్ని గుర్తించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 1608లో ఆర్కెటిక్ సముద్రంలో కూడా ఇలాగే ఓ వింత రూపాన్నికనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది.
పుస్తకాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఎక్కువగా ఈ రూపాలు స్ర్తీ రూపంతోనే అభివర్ణించబడ్డాయి. అందుకని మెర్మైడ్ అనగానే మత్స్యకన్య లేదా జలకన్య అని పిలవడం జరుగుతూ వస్తోంది.

హైఫా బే ప్రాంతంలో 2009 ఆగస్టులో జలకన్యని చూసినట్లు కొందరు చెబుతారు. ఆధారం చూపిన వారికి ఒక మిలియన్ డాలర్ల బహుమతిస్తామని ప్రకటించారు అప్పట్లో. కానీ, ఆధారాలు దొరకలేదు.
అవన్నీ పుకార్లేనా.?
2012లో జింబాబ్వేలో కూడా మెర్మైడ్ గురించిన పుకార్లు షికారు చేశాయి. అయితే, ఎక్కడా దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాల్లేవ్. ఇదిలా ఉంటే, చేప, అలాగే కోతి ఈ రెండింటినీ కలగలిపి మెర్మైడ్‌గా చిత్రీకరించే ప్రయత్నాలు కొన్ని జరిగాయ్.
వాస్తవానికి సముద్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రపంచం. కోట్లాది సముద్ర జీవుల్ని మనం గుర్తించినా.. ఇంకా ఎన్నో, ఎన్నెన్నోవిచిత్ర జీవులు అప్పుడప్పుడూ వెలుగు చూస్తూనే ఉంటాయ్. ఆ లెక్కన మెర్మైడ్ కూడా ఉంటే ఉండొచ్చుగాక.
సినిమాటిక్ కథలెన్నో..
ఇక, సినిమాలు, పురాణ గాధలు, కథలు, నవలలు.. వీటి గురించి చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా మెర్మైడ్‌ల గురించిన ప్రస్థావన కనిపిస్తూంటుంది. హిందూ మతానికి సంబంధించి శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం ధరించడం గురించి మనందరికీ తెలుసు.
ఇంతకీ మెర్మైడ్ అలియాస్ మత్స్యకన్య అలియాస్ జలకన్య ఉన్నట్లా.? లేనట్లా.? ఏమో దొరుకుతుందేమో. ‘ఉండొచ్చ.. ’ అనే భావన తప్ప ఖచ్చితంగా ‘లేదు’ అని ఖండించి పారేయలేం.
Also Read: భూమికి గ్రహశకలాల ముప్పు.. ఎలా.? ఎప్పుడు.?
ఎందుకంటే, జన్యుపరమైన సమస్యలతోనో, ఇతరత్రా కారణాలతోనో ఇవేవీ కాకపోతే పులీ, సింహాన్ని కలిపి ‘లైగర్’ అనే కొత్త జంతువును సృష్టించినట్లుగా మనిషే జలకన్యలను (Mermaid జలకన్య) సృష్టించినా ఆశ్చర్యపోవల్సిన పని లేదు.