Thegmpu Review.. తమిళ హీరో అజిత్ నుంచి ఓ సినిమా వస్తోందంటే, అతని అభిమానులు ఆ సినిమా నుంచి చాలా చాలా ఆశిస్తాడు. సినిమా కోసం ఏం చేయడానికైనా అజిత్ సిద్ధమే. అంతలా కష్టపడతాడు కూడా.
కానీ, ఏం లాభం.? కథల ఎంపికలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. ‘వలిమై’ సినిమా మొన్నామధ్యన వచ్చింది. రిస్కీ స్టంట్స్ చేసి మెప్పించాడు అజిత్. కానీ, సినిమా రిజల్ట్.. ప్చ్.!
మరిప్పుడు, ‘తునివు’ పరిస్థితేంటి.? బ్యాంక్ రాబరీ.. సామాన్యుల్ని బడాబాబులు మోసగించడం.. ఇలా ఓ మంచి పాయింట్ అయితే వుంది కథలో. కానీ, దాని ఎగ్జిక్యూషన్ సరిగ్గా వుండాలి కదా.!
Thegimpu Review.. కథా కాకరకాయ్.. ఏమీ లేవ్..
కథ ఎటో వెళ్ళిపోతుంది.. కథనంలో ఏదేదో అయిపోతుంటుంది. కొన్ని యాక్షన్ సీన్స్ బావున్నాయ్. నటన పరంగా అజిత్‌కి వంక పెట్టలేం.
సినిమాటోగ్రఫీ బావుంది.. మ్యూజిక్ అక్కడక్కడా బావున్నా, ఓవరాల్‌గా ప్చ్.. అనిపిస్తుంది. ఎడిటింగ్ అయితే దారుణం.! ఓవరాల్‌గా ‘తునివు’ సినిమా చూడాలంటే, ‘తెగింపు’ కావాల్సిందే.
Also Read: Nabha Natesh.. ఇస్మార్ట్ గాయం.!
అన్నట్టు, తెలుగులో ఈ సినిమా టైటిల్ ‘తెగింపు’. చూసే ప్రేక్షకుడు అన్నిటికీ తెగించేస్తేనే సినిమా చూడాలేమో.. అన్నట్లుంది పరిస్థితి.
సంక్రాంతి సీజన్.. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు పోటీగా.. ముందుగానే బరిలోకి వచ్చేసింది ‘తెగింపు’. తమిళంలోనే.. అజిత్ అభిమానులే పెదవి విరిచేస్తున్నారు.
తమిళ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా గుర్తుందా.? అందులో ఓ షాపింగ్ మాల్‌లో దాదాపుగా కథ మొత్తంగా నడిపించేశారు. అదే కాస్త బెటర్. ఇంచుమించు అదే లైన్‌లో వుంటుంది ఈ ‘తెగింపు’ కూడా.
కాకపోతే, అది షాపింగ్ మాల్ బ్యాక్‌డ్రాప్.. ఈ ‘తెగింపు’ది బ్యాంక్ బ్యాక్‌డ్రాప్ అంతే తేడా..