Third World War Speculations.. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చదువుకున్నాం.. రెండో ప్రపంచ యుద్ధం గురించీ చదువుకున్నాం. మూడో ప్రపంచ యుద్ధం సంగతేంటి.?
ఎప్పటికప్పుడు మూడో ప్రపంచ యుద్ధం గురించిన చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే వుంటోంది. అమెరికా – రష్యా మధ్య కోల్డ్ వార్ సమయం నుంచీ వింటూనే వున్నాం ఈ మూడో ప్రపంచ యుద్ధం గురించి.
ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుద శక్తి గల దేశాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఏ దేశానికి ఆ దేశం ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది.
ఇప్పుడున్న అణ్వాయుధాలతో, భూమ్మీద జీవం జాడ లేకుండా చేసేసుకోవచ్చు. ఏ దేశం అణ్వాయుధాలతో దాడి చేసినా, ప్రపంచం ఒక్కసారిగా భగ్గుమంటుంది. ఆ తర్వాత మిగిలేదేమీ వుండదు.
అందుకే, అణ్వాయుధాల్ని తమ రక్షణ కోసం పెంచుకుంటున్నాయి ఆయా దేశాలు. అంతే తప్ప, ఎవరి మీదా ప్రయోగించడానికి సాహసించడంలేదు.
ఇక, ప్రపంచం ప్రశాతంగా లేదు. ఎక్కడో ఓ చోట యుద్ధం జరుగుతూనే వుంది. చిన్న యుద్ధమా.? పెద్ద యుద్ధమా.? అన్నదే తేడా.
ఇరాకీ నియంత సద్దాం హుస్సేన్ దగ్గర్నుంచి.. ఇరాన్ నియంత కమీనే వరకూ.. ఎందరో నియంతల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేలాది, లక్షలాది మంది.. చనిపోతూనే వున్నారు.
అమెరికా యుద్ద కాంక్ష.. అనే మాట తరచూ వినిపిస్తూనే వుంది. చాలా ఏళ్ళుగా నడుస్తున్న ప్రసహనం ఇది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గొడవ.. అందులో అమెరికా పెత్తనం.. తెలిసిన విషయాలే.
మొన్నటికి మొన్న వెనుజులపై అమెరికా దాడి, ఈ క్రమంలో రష్యన్ జలాంతర్గామి రంగంలోకి దిగిందన్న ప్రచారంతో, మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందన్ ప్రచారం జరిగింది.
కానీ, ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగిపోయింది. అమెరికా తాను చేయాలనుకున్నది చేసుకుపోయింది. ఏం సాధించింది అమెరికా.? అంటే, గుండు సున్నా.!
భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్.. ఇది కూడా, మూడో ప్రపంచ యుద్ధం.. అనే చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులు వేరు.. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వేరు.
అందుకే, సమీప భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వస్తే మాత్రం, భూమ్మీద జీవం అంతమైపోతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు.
