Tiger Nageswara Rao FDFS.. రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ థియేటర్లలోకి వచ్చేసింది.
ఇదొక బయోపిక్ అనుకోవచ్చు.! అనుకోవడమేంటి, బయోపిక్కే.! మాస్ మహరాజ్ రవితేజకి తొలి పాన్ ఇండియా సినిమా ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’.
ప్రమోషన్స్ వేరే లెవల్‌లో జరిగాయ్.! ఈ సినిమాలో నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ ఫిమేల్ లీడ్స్‌గా కనిపించారు.
అన్నట్టు, చాలాకాలం తర్వాత ఈ సినిమాతో వెండితెరపై మెరిసింది రేణు దేశాయ్ (Renu Desai).! ఇలా, చాలా ప్రత్యేకతలు ఈ సినిమాపై విపరీతమైన హైప్‌కి కారణమయ్యాయి.
Tiger Nageswara Rao FDFS.. సినిమా ఎలా వుంది.?
ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే, సినిమా బావుందిగానీ.. సాగతీతకు గురయ్యిందన్నది ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వినిపిస్తోన్న వాదన.
వీఎఫ్ఎక్స్ విషయంలోనూ ఓవర్సీస్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. యాక్షన్ బ్లాక్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారట.
రవితేజ ఎనర్జీ షరామామూలుగానే వేరే లెవల్‌లో వుందని ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా నిడివి పెరగడం పెద్ద సమస్య.. అనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు (అంటే, ఉదయం 8.30 నిమిషాల సమయానికి) ఓవర్సీస్ రిపోర్ట్స్ విశ్లేషిస్తే, సినిమా యావరేజ్ టు ఎబౌ యావరేజ్ అని చెప్పొచ్చు.
కానీ, ఇలా డల్ టాక్‌తో వచ్చిన చాలా సినిమాల్ని సూపర్ హిట్ చేసింది రవితేజ స్టార్‌డమ్.! అదే సమయంలో, కొన్ని తేరుకోలేకపోయాయి కూడా.
సో, సాయంత్రం వరకు వేచి చూస్తే పిక్చర్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఫుల్ రివ్యూ కాస్సేపట్లో.!