Table of Contents
Tirupati Bhumana Idol Controversy.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఓ విగ్రహం వివాదానికి కారణమయ్యింది. ఈ వివాదం వెనుక రాజకీయ కోణం సుస్పష్టం.
వివాదమేంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తిరుపతిలో అవమానం, అపచారం జరిగాయన్నది వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ.
ఇంకేముంది.? వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే చేయడం మొదలెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ కట్టు కథలు అల్లేశారు.
Tirupati Bhumana Idol Controversy.. పక్కా ప్లానింగ్..
ముందుగా, కాన్సెప్ట్ రెడీ చేసుకుని.. ఎగ్జిక్యూట్ చేసినట్లుగా.. మొత్తం వివాదం నడిచింది.
విగ్రహం దగ్గరకు భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి, ఫొటోలకు పోజులివ్వడం, ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. చకచకా జరిగిపోయాయి.
వైసీపీ అధికారిక మీడియా, అందులో యూ ట్యూబ్ ఛానళ్ళు, వెబ్ సైట్లు.. అన్నిట్లోనూ ఒకే తరహా పెయిడ్ ఆర్టికల్స్ దర్శనమిచ్చాయి.
ఇరవై రెండేళ్ళ క్రితం నాటి విగ్రహం..
కట్ చేస్తే, ఇదంతా ఫేక్.. అని తేలిపోయింది. స్వయంగా విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తులే మీడియా ముందుకొచ్చి, వాస్తవాల్ని బయటపెట్టారు.
విగ్రహం.. ఇరవై రెండేళ్ళ క్రితం నాటికి. నిజానికి, దాన్ని విగ్రహం.. అని కూడా అనకూడదు. అదొక శిల్పం. బెంగళూరుకి చెందిన భక్తుడొకరు, విగ్రహం కోసం ఆర్డర్ చేశారు.
విగ్రహానికి సంబంధించిన నమూనా కూడా, సదరు భక్తుడే శిల్పికి అందించాడు. శిల్పం చెక్కుతున్న సమయంలో, ఆ భక్తుడు మృతి చెందడంతో, శిల్పం అసంపూర్తిగానే ఆగిపోయింది.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు..
శిల్పానికి శాస్త్రబద్ధంగా ప్రాణ ప్రతిష్ట చేస్తే, అప్పుడది విగ్రహంగా మారుతుంది. ఎన్నో శిల్పాలు, విగ్రహాలుగా మారకుండానే మిగిలిపోతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
పైగా, 22 ఏళ్ళ నుంచి అక్కడే పడి వున్న ఆ శిల్పాన్ని వైసీపీ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు సందర్శించలేదు? ఇప్పుడు చేసినట్లు అప్పట్లో పబ్లిసిటీ స్టంట్లు ఎందుకు చెయ్యలేదు.?
Also Read: ‘కన్నప్ప’ సమీక్ష: ఆ కక్కుర్తే.. కొంప ముంచిందప్పా.!
టీటీడీ ఛైర్మన్‌గా కరుణాకర్ రెడ్డి గతంలోనూ పని చేశార. అప్పుడూ, భూమన కరుణాకర్ రెడ్డికి ఈ విగ్రహం మీద బాధ్యత లేకుండా పోయింది.
అసలు భూమన కరుణాకర్ రెడ్డి హిందువే కాదు.! ఆయన వామపక్ష వాది. పైగా, క్రిస్టియన్.. అనే విమర్శలు ఆయనపై ఇప్పటివి కావు.!
అన్నట్టు, ఆ విగ్రహం వెంకటేశ్వర స్వామికి సంబంధించినది కాదనీ, బెంగళూరు భక్తుడు ‘శనీశ్వరుడి’ విగ్రహాన్ని తనకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకున్నాడని శిల్పులు చెప్పడం కొసమెరుపు.
