Home » టాలీవుడ్‌ క్వీన్‌.. ‘ఇయర్‌-18’ ఎవరు.?

టాలీవుడ్‌ క్వీన్‌.. ‘ఇయర్‌-18’ ఎవరు.?

by hellomudra
0 comments

2018 (Tollywood Queen 2018) లో కొత్త భామలు తెలుగు తెరపై సందడి చేశారు. సీనియర్‌ భామలూ సత్తా చాటారు. కొందరికి ఫెయిల్యూర్స్‌ ఎదురయ్యాయి. మరికొందరు సంచలన విజయాలు అందుకున్నారు.

అనుష్క (Anushka Shetty), సమంత (Samantha Akkineni), కియారా అద్వానీ (Kiara Advani), కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), తమన్నా (Tamannah), రష్మిక మండన్న (Rashmika Mandanna), కీర్తి సురేష్‌ (Keerthy Suresh), పూజా హెగ్దే (Pooja Hegde), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), అనూ ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel), పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput).. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలా పెద్దదే.

కీర్తి సురేష్‌కి ‘అజ్ఞాతవాసి’ సినిమా రూపంలో పెద్ద ఫెయిల్యూర్‌ మొదట్లోనే తగిలినా, ఆ తర్వాత ఆమె పుంజుకుంది. స్ట్రెయిట్‌ సినిమాలు, డబ్బింగ్‌ సినిమాలతో హోరెత్తించింది. అనూ ఇమ్మాన్యుయేల్‌ మాత్రం కోలుకోలేదు. రష్మిక మండన్న రెండు సినిమాలు చేసింది. మిల్కీ బ్యూటీ సరికొత్తగా అలరించేందుకు ప్రయత్నించినా, విఫలమయ్యింది ‘నా నువ్వే’ సినిమాతో.

కియారా అద్వానీ, దక్ష నగార్కర్‌ (Daksha Nagarkar), ప్రియాంక జవాల్కర్‌ (Priyanka Jawalkar), నభా నటేష్‌ (Nabha Natesh), పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) లాంటి ఎందరో కొత్త భామలు తెలుగు తెరపై తమ అదృష్టాన్ని ఈ ఏడాదిలోనే పరీక్షించుకున్నారు. గుర్తింపు తెచ్చుకున్నారు కూడా.

ఇది భాగమతి అడ్డా..

‘భాగమతి’ అంటూ అనుష్క 2018 సంక్రాంతి తర్వాత సంచలన విజయాన్ని అందుకుంది. జనవరిలో ఇదే అతి పెద్ద విజయం తెలుగు సినిమాకి. ‘ఇది భాగమతి అడ్డా’ అంటూ అనుష్క, తనకు తిరుగే లేదని నిరూపించుకున్న చిత్రమది. వయసు మీద పడ్తున్నా, అనుష్క సత్తా తగ్గలేదు. ఆమె బాక్సాఫీస్‌ స్టామినా తెలుగులో ఇంకే ఇతర హీరోయిన్‌కీ లేదని నిస్సందేహంగా చెప్పొచ్చేమో.

అదరగొట్టిన సమంత, కియారా అద్వానీ

‘రంగస్థలం’, ‘యూ టర్న్‌’ స్ట్రెయిట్‌గా సూపర్‌ హిట్స్‌ ఇచ్చాయి సమంతకి. డబ్బింగ్‌ మూవీ ‘అభిమన్యుడు’ కూడా సమంతకి మంచి హిట్‌ అందించింది. ‘మహానటి’ సినిమాలోనూ సమంత మెరిసింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొత్తంగా ఈ ఏడాది సమంత ఖాతాలో సంచలన విజయాలు పడ్డాయన్నమాట. 2018 ఏడాది సమంతకు భలేగా కలిసొచ్చింది.

మరో వైపు బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) తన తొలి తెలుగు సినిమా ‘భరత్ అనే నేను’తో మంచి విజయాన్ని అందుకుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా కియారా అద్వానీకి ఈ సినిమాతో మంచి మార్కులు పడ్డాయి. తన తొలి తెలుగు సినిమాతోనే ఈ బ్యూటీ వంద కోట్ల క్లబ్ (వసూళ్ళు) లోకి చేరిపోవడం చిన్న విషయమేమీ కాదు.

‘మహానటి’తో దక్కిన ‘కీర్తి’ (Tollywood Queen 2018)

వయసుకు మించిన పాత్ర.. ఆ పాత్రను పోషించేందుకు సరిపోను అనుభవం.. ఇలా ‘మహానటి’ సినిమా టైమ్‌లో కీర్తి సురేష్‌ గురించి చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, కీర్తి సురేష్‌ ఎక్కడా భయపడలేదు. పైగా, భక్తితో ఆ సినిమా చేసింది.

మహానటి సావిత్రమ్మ పాత్రలో ఒదిగిపోవడమంటే కష్టం.. అని చెబుతూనే, సత్తా చాటింది. ఒకవేళ సావిత్రి జీవించి వుంటే, ఖచ్చితంగా కీర్తి సురేష్‌ని ఆమె ప్రశంసించేవారే. ఆ స్థాయిలో కీర్తి సురేష్‌ ‘మహానటి’ సినిమాతో అందరి ప్రశంసలూ అందుకుంది.

‘అజ్ఞాతవాసి’తో దెబ్బతిన్న కీర్తి సురేష్‌, ‘మహానటి’ (Tollywood Queen 2018) తో కోలుకుంది. అయితే పలు డబ్బింగ్‌ సినిమాలు ఆమెకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని తెలుగులో అందించాయి.

‘పందెం కోడి-2’, ‘సామి-2’, ‘సర్కార్‌’ సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. వీటిల్లో ‘సామి-2’ నిరాశపర్చింది. మిగతా రెండు సినిమాలూ ఫర్వాలేదన్పించాయి. టాక్‌ ఎలా వున్నా, ‘పందెం కోడి-2’ తెలుగులో వసూళ్ళను బాగానే అందుకుంది.

పాయల్‌.. జిల్‌ జిల్‌ జిగేల్‌

2018లో తెలుగు సినిమాకి సంబంధించి ఎక్కువమంది ఏ కొత్త హీరోయిన్‌ గురించి మాట్లాడుకున్నారో తెలుసా.? పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమా ఆమెకు అంతటి గుర్తింపు తెచ్చింది. ‘రా’ ఫిలిం కావడంతో, పాయల్‌ రాజ్‌పుత్‌ ఒకింత ఓవర్‌ డోస్‌ ఎక్స్‌పోజింగ్‌ చెయాల్సి వచ్చింది.

కేవలం ఎక్స్‌పోజింగ్‌తోనే పాయల్‌కి ఈ గుర్తింపు వచ్చిందనుకుంటే పొరపాటే. నటన పరంగానూ పాయల్‌ ‘భళా’ అన్పించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ, తమిళంలోనూ వరుస అవకాశాల్ని పాయల్‌ దక్కించుకుంటోందంటే, దానిక్కారణం ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా సాధించిన విజయమే.

కాజల్‌, తమన్నా.. ప్చ్‌!

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో ‘అ’, ‘ఎమ్మెల్యే’, ‘కవచం’ తదితర సినిమాల్లో నటించింది ఈ ఏడాది. అయితే అవేవీ ఆమెకు సరైన సక్సెస్‌లు ఇవ్వలేకపోయాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అంతే. ఆమెకు ‘నా నువ్వే’, ‘నెక్స్‌ట్‌ ఏంటి’ సినిమాలు పరాజయాన్నే మిగిల్చాయి. మెహ్రీన్‌కి కూడా ఈ ఏడాది కలిసి రాలేదు. ‘పంతం’, ‘కవచం’, ‘నోటా’ తదితర సినిమాల్లో నటిస్తే, ఈ మూడూ నిరాశపర్చాయామెకి.

ఫర్వాలేదన్పించిన పూజా హెగ్దే

2018 పూజా హెగ్దేకి ఫర్వాలేదన్పించింది ‘జిగేలు రాణి’ అంటూ ‘రంగస్థలం’లో ఆమె చేసిన ఐటమ్‌ సాంగ్‌ ఓ ఊపు ఊపేసింది. ‘సాక్ష్యం’ ఓకే అన్పించింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన ఆమె నటించిన ‘అరవింద సమేత’ కూడా అంతే.

మొత్తంగా మూడు పెద్ద సినిమాల్లో నటించిన హెగ్దేకి ఆశించిన స్టార్‌డమ్‌ అయితే ఈ ఏడాది లభించలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.

గోల్డెన్‌ బ్యూటీ రష్మిక (Tollywood Queen 2018)

ఈ ఏడాది రెండు తెలుగు సినిమాల్లో నటించిన రష్మిక మండన్న, ‘గీత గోవిందం’తో సంచలన విజయాన్ని అందుకుంటే, ‘దేవదాస్‌’తో ఫర్వాలేదన్పించింది. మొత్తంగా ఈ ఏడాదిలో రష్మిక మండన్న గురించి తెలుగు సినీ అభిమానులు కాస్త ఎక్కువగానే మాట్లాడుకున్నారు. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా పలుమార్లు ఆమె పేరు వార్తల్లోకెక్కింది.

ఏదిఏమైనా, 2018లో తెలుగు సినిమా గ్లామర్‌ (Tollywood Queen 2018) ఓ వెలుగు వెలిగిందని చెప్పక తప్పదు. ఫెయిల్యూర్స్‌ వచ్చినా, హీరోయిన్స్‌ ఏదో ఒక రకంగా వార్తల్లో వున్నారు. ఆయా సినిమాల ప్రమోషన్స్‌లో హల్‌చల్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా కిర్రాకు పుట్టించేశారు.

కొత్త సంవత్సరంలో సక్సెస్‌లు కొనసాగించాలని కొందరు, పాత సంవత్సరంలో పరాజయాల్ని చవిచూసినా, ఆ బాధను మర్చిపోయి కొత్త సంవత్సరంలో సరికొత్త విజయాల్ని అందుకోవాలని మరికొందరు.. వెరసి అందాల భామలు.. అందంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడ్తున్నారన్నమాట.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group