Traffic Challans Political Criminals.. ఐదు, అంతకు మించి ట్రాఫిక్ చలాన్లు పెండింగులో వున్నాయా.? జాగ్రత్త, మీ లైసెన్స్ రద్దయ్యే అవకాశాలున్నాయ్.!
ఈ మేరకు కొత్త నిబంధనని తెరపైకి తీసుకురానున్నారట. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ళలో అలసత్వానికి ఆస్కారమివ్వకుండా, ఈ కొత్త నిబంధన పనికొస్తుంది.
మంచిదే.! ట్రాఫిక్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే, ప్రమాదాలు జరిగే ఆస్కారముంది.
అందుకే, ట్రాఫిక్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలి. సరికొత్త నిబంధనలూ తెరపైకి రావాలి.!
కానీ, చట్టాలు చేసే రాజకీయ నాయకుల సంగతేంటి.?
Traffic Challans Political Criminals.. నేరాలు చేస్తే, రాజకీయాల్లో ప్రమోషన్.!
అక్రమాస్తుల కేసు వుందా.? అయితే, ముఖ్యమంత్రి పీఠమెక్కించల్సిందే.! రేప్ కేస్ వుందా.? అయితే, రాజకీయాల్లో ప్రమోషన్ ఇవ్వాల్సిందే.!
దాదాపు అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే తంతు.! నేరస్తులు తప్పించుకోవడానికి, రాజకీయం అనేది రక్షణ కవచంగా మారుతోందన్నది బహిరంగ రహస్యం.
మరి, నేరస్తులు రాజకీయాల్లోకి వెళ్ళి, రాజకీయం అనే రక్షణ కవచం పొందాక, వాళ్ళు ప్రజా ప్రతినిథులుగా మారి, చట్టాలు చేస్తే, ఆ చట్టాలెలా వుంటాయ్.?
క్రిమినల్ కేసులుంటే, చట్ట సభల్లోకి అడుగు పెట్టడానికి అనర్హులు.. అనే చట్టాలు కదా రావాల్సింది.? ప్చ్.. అది మాత్రం జరగదుగాక జరగదు.!
ఎన్ని క్రిమినల్ కేసులుంటే, రాజకీయంగా అంత గొప్ప ట్రాక్ రికార్డ్ అన్నమాట.! ఇది చాలాకాలంగా నడుస్తున్న తంతు.. అయినా, ఇప్పుడు కొత్తగా ఇది చర్చనీయాంశమవుతోంది.
ట్రాఫిక్ చలాన్లతో పొలిటికల్ క్రిమినల్స్‌ని పోల్చడం ఎంతవరకు సబబు.? అంటే, ట్రాఫిక్ చలాన్లు వసూలు సరే, రోడ్ల మీద గుంతల సంగతేంటి.? అన్న చర్చ తెరపైకొస్తుంది.
నిజమే, రాజకీయ అవినీతి కారణంగానే కదా.. రోడ్లు అధ్వాన్నంగా తయారవుతున్నాయి.? అన్నది సగటు వాహనదారుడి ఆవేదన.!
Also Read: బంగారమ్.. భారతమ్.! 25 వేల టన్నుల గోల్డ్.. మనదే.!
రాజకీయ నాయకులు, బైక్ ర్యాలీలు చేసినప్పుడు.. అసలంటూ ట్రాఫిక్ నిబంధనలే పాటించరు. మరి, చలాన్లు వేస్తారా పోలీస్ అధికారులు.? ఛాన్సే లేదు.!
రోడ్లపై రాజకీయ నాయకులకు సంబంధించిన వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగ్గా వుండవు. ట్రాఫిక్ విభాగం ఎందుకు చలాన్లు విధించదు.?
సామాన్యుడే, ట్రాఫిక్ విభాగానికి లోకువ.!
