Table of Contents
Trailer of Lakshmi’s NTR released (Trailer Review Lakshmi’s NTR) today and the occasion Valentine’s day is some thing co-incidental. Director Ram Gopal Varma said it earlier as a real story with mixex emotions. Lakshmi’s NTR is all about Late Nandamuri Taraka Ramarao’s and his last days of life. NTR is pride of Telugus and all we know that he is a great Actor and Politician, who was backstabed by his own people.
లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi’s NTR) అంటే ఓ సినిమా మాత్రమే కాదు. ‘ఇది నిప్పులాంటి నిజం’ అంటాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma).
ఏళ్ళుగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను ఇన్నాళ్ళకు తెరపై చూసుకునే అవకాశం కలుగుతుందంటారు స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి. ‘ఆ మహానుభావుడి చివరి రోజులు ఎంత దారుణంగా గడిచాయో మాకు తెలుసు. ప్రజలందరికీ అది తెలియాలి’ అంటారూ స్వర్గీయ ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితులైనవారు.
అసలేం జరిగింది? లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో అసలేముంది? తెలుసుకుందాం పదండిక. అది 1989 అంటూ ట్రైలర్ మొదలయ్యింది. అంటే, బహుశా సినిమా కూడా అప్పటినుంచే ప్రారంభమవుతుందేమో. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత, తెలుగుదేశం పార్టీలో, స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ఆధారంగా చేసుకుని రామ్‌గోపాల్ వర్మ ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని తెరకెక్కించారు.
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం, ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన గొడవలు, తెలుగుదేశం పార్టీలో పుట్టిన ప్రకంపనలు.. వీటన్నిటినీ ట్రైలర్‌లోనే దాదాపుగా చూపించేశారు వర్మ.
ఇదీ అసలు కథ (Trailer Review Lakshmi’s NTR)
తన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతిని తన జీవిత భాగస్వామిగా స్వర్గీయ ఎన్టీఆర్ మార్చుకోవడం వెనుక తన చుట్టూ జరిగిన దుష్ప్రచారమే కీలక భూమిక పోషించిందని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పారంటారు ఆయన సన్నిహితులు. ఆ విషయాన్నే ట్రైలర్‌లో దాదాపుగా వర్మ చూపించడం గమనార్హం. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బూతులు తిట్టడం, కొట్టడం కూడా ట్రైలర్‌లో కన్పించాయి.
‘దానికి గనుక కొడుకు పుడితే..’ అంటూ ఓ కుటుంబ సభ్యుడు, ఇతర కుటుంబ సభ్యులతో చెప్పడం ఈ ట్రైలర్‌లోనే అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం. ఇంకో మహిళతో ఈ వయసులో మీకు అవసరమా? అని కొడుకు, తండ్రిని నిలదీసేందుకు చేసిన ప్రయత్నమూ ట్రైలర్‌ని ఆసక్తికరంగా మార్చేసింది. ట్రైలర్ చివర్లో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న సందర్భం నభూతో న భవిష్యతి అనడం అతిశయోక్తి కాదేమో.
నటీ నటులు పోటీ పడ్డారు..
కన్నడ నటి యజ్నా శెట్టి (Yagna Shetty), లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) పాత్రలో నటించింది. స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర కోసం రంగస్థల నటుడ్ని ఎంచుకున్నాడు రామ్‌గోపాల్ వర్మ (RGV). సినిమాకి కొత్తే అయినా, స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయాడాయన.
నిజానికి ఎన్టీఆర్ పాత్ర అంటే తేలిక కాదు, అతి క్లిష్టమైన ఆ పాత్ర, అందులోని అంతకంటే క్లిష్టమైన భావోద్వేగాల్ని చాలా బాగా పండించాడు. చంద్రబాబు పాత్రధారి సైతం అద్భుతమైన హావభావాలతో ఆకట్టుకున్నాడు. Lakshmi’s NTR trailer lo బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్.. ఇలా ఒకటేమిటి అన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి వున్నాయి.
రామ్‌గోపాల్ వర్మతోపాటు అగస్త్య మంజు అనే ఇంకో పేరు కూడా డైరెక్షన్ విభాగంలో కన్పించడం గమనార్హం. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, రాకేష్ రెడ్డి – దీప్తి బాలగిరి ఈ సినిమాని కంపెనీ సినిమా పతాకంపై జీవీ ఫిలింస్ సమర్పణలో రూపొందించారు.
కంట తడి పెట్టిన లక్ష్మీ పార్వతి (Trailer Review Lakshmi’s NTR)
ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ (Trailer Review: Lakshmi’s NTR) గురించి మాట్లాడుతూ లక్ష్మీ పార్వతి కంటతడి పెట్టారు. ‘‘తనకు ఆనాడు జరిగిన అన్యాయం కళ్ళకు కట్టినట్లుగా వర్మ ఈ సినిమాలో చూపించారని చెప్పారామె. ప్రతి డైలాగ్ నిజం, ప్రతి సన్నివేశం నిజం.. ఆనాటి ఆ విషయాల్ని నేనెప్పటికీ మర్చిపోలేను..’’ అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి.
అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబు అభిమానులు మాత్రం, రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడుతున్నారు. చరిత్రని వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఆనాటి పరిస్థితులు వర్మకి తెలియదనీ, నాయకత్వ మార్పుని వెన్నుపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో చాలా జరిగాయనీ, వాటిని ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు మద్దతుదారులు అంటున్నారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులేమంటారో?
కాస్త జాగ్రత్తగా చూస్తే, సినిమాలో చాలా పాత్రలు కన్పిస్తాయి. వాటిల్లో ఎక్కువ పాత్రలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులవే. వారంతా లక్ష్మీ పార్వతిపై మాటలతోనో, భౌతికంగానో దాడులు చేసినట్లే కనిపిస్తోంది ట్రైలర్ లో. మరి, దీన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా.? వర్మకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అలా నినదిస్తే ఏం జరుగుతుంది.?
Okkati maatram nijam, Varma cheyyalanukunnadi chesesadu. Vivadalu Aayanaki kotha kadu. Elections mundara Varma choopinchina ee trailer, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పెద్ద Shock. వేచి చూడాలి, తదుపరి ఏం జరగబోతోందో తెలియాలంటే.
పోటెత్తుతోన్న వ్యూస్
Social Media lo views potethutunnayi. Kevalam 2 gantallone 1 million views daatesindi Lakshmi’s NTR trailer. వర్మ ఈ ట్రైలర్ ద్వారా ఏం చూపించబోతున్నాడనే ఉత్కంఠే దీనంతటికీ కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు. Varma is one and only, who can deal this type of subejcts అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.