Tripti Dimri Jr NTR తెలుగులో జూనియర్ ఎన్టీయార్‌తో నటించాలని వుందంటూ అప్పట్లో జాన్వీ కపూర్ చెప్పింది. ‘దేవర’ సినిమాలో నటించేస్తోంది జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి.!
ఇక, అలియా భట్ కూడా అంతే.! జూనియర్ ఎన్టీయార్‌తో నటించాలని వుందంటూ చాన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించేసింది.. అఫ్‌కోర్స్, రామ్ చరణ్‌కి జోడీగానే లెండి.. అది వేరే సంగతి.!
ఇక, ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి కూడా జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి నటించాలని వుందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Tripti Dimri Jr NTR.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ట్రై చేస్తావా.?
జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ నటించే సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే.
సో, తృప్తి దిమ్రి కోరిక నెరవేరాలంటే, ప్రశాంత్ నీల్ ఆమె గురించి ఒకింత సీరియస్‌గానే ఆలోచించాలేమో.!

‘యానిమల్’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది తృప్తి దిమ్రి. నిజానికి, ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్ రష్మిక మండన్న.
కానీ, చిన్న పాత్రలో కనిపించిన తృప్తి దిమ్రి పేరు మార్మోగిపోతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరరోగా నటించిన సినిమా ‘యానిమల్’.!