Tripti Dimri Lucky Chance.. ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు త్రిప్తి దిమ్రి. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండింగ్ బ్యూటీ అయిపోయిందీ బాలీవుడ్ బ్యూటీ.
బోల్డ్ పాత్రలో నటించి ఈ సినిమాతో కుర్రాళ్లకు హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఎక్కడ విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే. ఆ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో త్రిప్తి పేరు వినిపించింది. కానీ, అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌లో బిజీగానే వుంది.
Tripti Dimri Lucky Chance.. బోల్డ్ మాత్రమే కాదు.. లక్కీ బ్యూటీ కూడా..
ప్రస్తుతం త్రిప్తికి మంచి ఆఫర్లొస్తున్నాయట. మొదట్లో బోల్డ్ పాత్రల్లోనే ఛాన్సెస్ వచ్చాయ్. కానీ, ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్‌లో అవకాశాలొస్తున్నాయని చెబుతోంది.

అందుకు తాను చాలా అదృష్టవంతురాలినని అంటోంది త్రిప్తి. చాలా మంది స్టార్ హీరోయిన్లున్నప్పటికీ తనకు ఈ మంచి అవకాశాలొస్తున్నాయని త్రిప్తి దిమ్రి చెబుతోంది.
నిజమే త్రిప్తి దిమ్రికి ఆ టాలెంటూ, పొటెన్షియాలిటీ వుంది. బోల్డ్ రోల్స్ మాత్రమే కాదు, ఛాలెంజింగ్ రోల్స్‌లోనూ నటించగల సత్తా వుంది.
క్యూ కడుతున్న ఆఫర్లు..
ప్రస్తుతం తెలుగులో ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తోంది త్రిప్తి దిమ్రి. ప్రబాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.
Also Read: వృక్ష రాజం.. కళాకృతిగా మారిన వైనం.! ఇదో అద్భుతం.!
సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాతోనే త్రిప్తి దిమ్రి పాపులర్ అయ్యింది. అయితే, అందులో చిన్న రోల్ మాత్రమే చేసింది.

స్పిరిట్‌లో మెయిన్ హీరోయిన్ రోల్‌లో త్రిప్తి నటిస్తోంది. దీంతో పాటూ, మరిన్ని తెలుగు ప్రాజెక్టులు ఆమె కోసం లైన్‌లో వున్నాయని తెలుస్తోంది.
