Trisha Krishnan Brinda Review.. కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, రాశి ఖన్నా.. ఇలా చాలామంది అందాల భామలు వెబ్ సిరీస్‌ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ లిస్టులో తాజాగా త్రిష కూడా చేరిపోయింది.
నటి త్రిష కృష్ణన్ తాజా వెబ్ సిరీస్, ‘బృంద’ స్ట్రీమింగ్ అవుతోంది.! పోలీస్ అధికారి పాత్రలో త్రిష కనిపించింది ఈ వెబ్ సిరీస్‌లో.!
పోలీస్ స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై.. అదే పోలీస్ స్టేషన్‌లో బద్ధకానికి మారుపేరైన సీఐ.. ఓ మర్డర్ మిస్టరీ.. ఇలా ప్రారంభమవుతుంది ఆ వెబ్ సిరీస్.
దేవుడ్ని నమ్మేవాళ్ళని.. వాళ్ళు ఏ మతానికి చెందినవాళ్ళైనాసరే.. చంపెయ్యాల్సిందేనని ఏకంగా సమాజం మీదనే పగబట్టేసేలా మెయిన్ విలన్ పాత్రని దర్శకుడు తీర్చిదద్దిన వైనం.. అత్యంత భయానకం.
Mudra369
ఓ గిరిజన ప్రాంతంలో, మూఢ నమ్మకాలకు తన కుటుంబాన్ని పోగొట్టుకునే ఓ కుర్రాడు, మొత్తంగా దేవుడ్ని నమ్మే మానవాళి మీద పగబట్టేస్తాడు.
అలా పగబట్టేసిన ఆ వ్యక్తికీ, వరుస హత్యల వ్యవహారాన్ని డీల్ చేసే పోలీస్ అధికారిణికీ సంబంధమేంటి.? అన్నది మిగతా కథ.!
Trisha Krishnan Brinda Review.. వీరోచిత పోరాటాలు చేసెయ్యలేదుగానీ..
త్రిష ఏమీ వీరోచిత పోరాటాలు చేసెయ్యలేదు.! కానీ, చీకట్లోకి ఒంటరిగా వెళ్ళిపోయి.. మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించేస్తుంటుంది. నటన పరంగా వంకలు పెట్టాల్సిన పనేం లేదు.
కాకపోతే, నటిగా ఇంకాస్త ఎక్కువ స్కోప్ ఆమెకు ఇచ్చి వుంటే బావుండేదేమో అనిపిస్తుంటుంది. యాక్షన్ పార్ట్ కూడా త్రిష మీద కొంచెం ఎఫెక్టివ్‌గా డిజైన్ చేసి వుండాల్సిందే.
కానీ, ఆ పాత్ర స్వభావాన్ని దర్శకుడు అలా డిజైన్ చేయడంతో, అందులో త్రిష కృష్ణన్ (Trisha Krishnan) చక్కగానే ఒదిగిపోయింది. పోలీస్ డ్రెస్‌కి త్రిష బాగానే సూటయ్యింది.
ఇద్దరు సైకోపాత్స్ మధ్య బాండింగ్.. అందులో ఒకడ్ని మనిషిగా మార్చేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం.. ఇవన్నీ ఒకింత ఆలోచింపజేస్తాయ్.
Mudra369
పోలీస్ స్టేషన్‌లో తనను వేధించే ఓ సీఐ, అలాగే తనకు అన్యమనస్కంగానే సహకరించే ఓ ఎస్ఐ.. ఈ ఇద్దర్నీ లీడ్ రోల్ డీల్ చేసే విధానం ఆకట్టుకుంటుంది.
పై అధికారి, ‘సిట్’ ఏర్పాటు చేసే క్రమంలో పురుషాధిక్య ధోరణి సహా, చాలా విషయాలు ఈ సినిమాలో సహజంగానే చూపించే ప్రయత్నం చేశారు.
ఆ పక్షి సంగతేంటి చెప్మా.?
ఓ విచిత్రమైన పక్షికి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లే ఇచ్చి, ఆ వ్యవహారాన్ని పూర్తిగా ఆ తర్వాత మర్చిపోవడం ఆశ్చర్యకరం.
వెబ్ సిరీస్ కాబట్టి, ‘స్లో’ పేస్‌కి కూడా అలవాటుపడిపోవాలేమో అని చాలా సిరీస్‌లు చెప్పకనే చెబుతుంటాయ్. స్లో విషయంలోనూ, ఈ ‘బృంద’ మీద కూడా కంప్లయింట్స్ వస్తాయ్.
చిన్నప్పటినుంచీ తనను వేధిస్తున్న గతం గురించి తెలుసుకోవాలన్న కనీస ఆలోచన ఓ పోలీస్ అధికారిణి చేయకపోవడం ఆశ్చర్యకరమే.
Mudra369
సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, ఎడిటింగ్.. అన్నీ బావున్నాయ్. రిచ్‌గానే తెరకెక్కించారు ఈ వెబ్ సిరీస్‌ని. వున్నంతలో రిచ్‌గానే వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు అనిపిస్తుంది.
ఓ దశలో, దేవుడ్ని నమ్మాలంటేనే భయమేసేలా ఇందులో కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేశారు. చూసేటప్పుడు, ‘మరీ ఇంత అవసరమా.?’ అనిపిస్తుంది ఎవరికైనా.
Also Read: నిహారిక ‘సుత్తి’.! నాగబాబు మెడపై విమర్శల ‘కత్తి’.!
సైకోపాత్స్ అనొచ్చు.. ఇంకేమైనా అనొచ్చు.. సమాజంలో ఇలాంటోళ్ళు వుంటే, వాళ్ళకి ఓ చక్కని ఐడియా ఇచ్చినట్లుంది ఈ వెబ్ సిరీస్.. మారణ హోమానికి సంబంధించి.
కేవలం, దీన్నొక కథగా చూస్తే.. బాగానే అనిపిస్తుంది. వెబ్ సిరీస్ చూశాక మాత్రం, జనం ఎక్కువగా వుండే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలంటే కొంత భయమేస్తుంది.