Trisha Krishnan OTT.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన త్రిషని ప్రస్తుతం అస్సలు పట్టించుకోవడం లేదు తెలుగు మేకర్లు. కానీ, తమిళంలో మాత్రం త్రిష ఇమేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ ఇమేజ్ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌నీ తాకనుంది. త్వరలోనే త్రిష ఓటీటీ తెరపై సందడి చేయబోతోందట.
తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ ఓ డిఫరెంట్ వెబ్ కంటెంట్‌తో త్రిషను సంప్రదించాడట. చాలా ఆసక్తికరంగా అనిపించడంతో త్రిష ఆ ప్రాజెక్ట్‌కి ఓకే చేసిందట.
Trisha Krishnan OTT.. తమిళ, మలయాళంలో బ్యాక్ టు బ్యాక్..
అతి త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘లియో (Leo)’ ’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు.
అలాగే, మరో సీనియర్ హీరో అయిన అజిత్ (Ajith Kumar).. తన 62వ సినిమా కోసం త్రిషను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే.
మరికొన్ని తమిళ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు త్రిష కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, ఓ మలయాళ సినిమాలోనూ ఇటీవల త్రిష (Trisha Krishnan) ఛాన్స్ కొట్టేసింది.
మలయాళ హీరో టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో త్రిష ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం ఎంపికైంది.
టాలీవుడ్ ఎందుకిలా.!
తమిళ, మలయాళ పరిశ్రమల్లో త్రిష ఈ స్థాయిలో జోరు చూపిస్తుంటే, హీరోయిన్ల కొరత వున్న టాలీవుడ్ మాత్రం త్రిషను ఎందుకు కన్సిడర్ చేయడం లేదో తెలియడం లేదు.

మొన్నా మధ్య రెమ్యునరేషన్ ఇష్యూ కారణంగా తెలుగు మేకర్లు త్రిషను పట్టించుకోవడం లేదట.. అనే ప్రచారం జరిగింది. కానీ, అందులో నిజం లేదనీ తేలింది.
తెలుగులో ఛాన్స్ దొరికితే నటించేందుకు త్రిష సిద్ధంగానే వుందట. కానీ, ఇక్కడి నుంచే గ్రీన్ సిగ్నల్ రావడం లేదనీ గుసగుసలాడుకుంటున్నారు.
తమిళంలో ప్రస్తుతం త్రిషకున్న క్రేజ్ వేరే లెవల్ అనుకుంటే, ఇకపై ఓటీటీ తెర పైనా త్రిష (Trisha Krishnan) తనకు తిరుగు లేదని నిరూపించుకునేలా కనిపిస్తోంది.
Also Read: మెగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్.? నిజమేనంటారా.?
అన్నట్లు, ఇప్పటికే కాజల్, తమన్నా, సమంత తదితర సీనియర్ భామలు ఓటీటీలో సత్తా చాటిన, చాటుతోన్న సంగతి తెలిసిందే.
అతి త్వరలోనే త్రిషను కూడా అలా చూడబోతున్నామన్న మాట.!