Trisha Krishnan Politics Vijay.. నో డౌట్.! రాజకీయమంటేనే రొచ్చు.! ఆ రొచ్చులోకి మగ మహరాజులైనా, మహిళామణులైనా.. నిర్లజ్జగా దూకేయాల్సిందే.
ఇందులో ఇంకో మాటకు తావు లేదంటారు రాజకీయాల్లో తలపండిపోయిన చాలామంది రాజకీయ ప్రముఖులు.
నిజానికి, రాజకీయమంటే ప్రజా సేవ. కానీ, ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిస్సిగ్గుగా కామెంట్లేయడం నేటి రాజకీయం.!
ఇక్కడ ఆడ, మగ.. అన్న తేడాల్లేవ్.! ఎవరైనా, ఎవర్నయినా.. ఎంత దారుణంగానైనా తూలనాడెయ్యొచ్చు. రాజకీయమంటే, అదో మెంటల్ సర్టిఫికెట్.. అని ఫీలవుతుంటారు కొందరు.
ఎవరెన్ని బూతులు తిడితే, అంత పెద్ద నాయకుడన్నట్టు లెక్క.! ఇదీ ప్రస్తుత రాజకీయాల్లో అమలవుతోన్న ఓ అనధికారిక నిబంధన.!
Trisha Krishnan Politics Vijay.. త్రిషని ఎందుకు లాగారు.?
నటి త్రిషకి సినీ పరిశ్రమలో చాలామంది సినీ ప్రముఖులు అత్యంత సన్నిహితులు. తమిళనాడులో అయితే, నటుడు విజయ్ ఆమెకి అత్యంత సన్నిహితుడు.
విజయ్, త్రిష పలు సినిమాల్లో నటించారు. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి రావడం తెలిసిన విషయమే. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది కూడా.
రాజకీయాల్లో విజయ్ ఎదుర్కొంటున్న హీట్ అంతా ఇంతా కాదు. విజయ్‌కి సన్నిహితురాలైన కారణంగా త్రిషకి కూడా ఆ హీట్ ఎదురయ్యింది.
చిత్రంగా విజయ్, త్రిషకి అక్రమ సంబంధాలు అంటగట్టేశాడో రాజకీయ ప్రముఖుడు.. అది కాస్తా, వివాదాస్పదమయ్యింది. విషయం, లీగల్ నోటీసుల వరకూ వెళ్ళింది.
ఖండించిన త్రిష.. సారీ చెప్తే సరిపోతుందా.?
తనను అకారణంగా రాజకీయాల్లోకి లాగారనీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, త్రిష చట్ట పరమైన చర్యలకు సిద్ధమైంది. దాంతో, త్రిష మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన రాజకీయ ప్రముఖుడు క్షమాపణ చెప్పాడు.
క్షమాపణతో త్రిష ఈ విషయాన్ని లైట్ తీసుకుంటుందా.? చట్టపరమైన పోరాటం కొనసాగిస్తుందా.? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాట రాజకీయాల్లో మహిళలపై దాడులు కొత్తేమీ కాదు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తమిళనాడు రాజకీయాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
కాగా, త్రిషకి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది.
