Janasena Strike Rate PSPK.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటీవల అంబానీ ఇంట పెళ్ళి వేడుక జరిగితే, ఆ వేడుకలో పాల్గొన్నారు.. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
అంబానీ ఇంట పెళ్ళి.. అంటే, ఆ హంగామా వేరే లెవల్‌లో వుంటుంది కదా.! భారత సినీ పరిశ్రమలో అగ్రస్థాయి నటీనటులందరూ ఆ వేడుకలో సందడి చేశారు.
సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులూ ఈ వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి సినీ, రాజకీయ ప్రముఖులూ అంబానీ ఇంట జరిగిన పెళ్ళి వేడుకలో హల్ చల్ చేశారు.
Janasena Strike Rate PSPK.. వేల కోట్ల ఖర్చుతో పెళ్ళి..
ఇదిలా వుంటే, ఈ వేడుక కోసం ఏకంగా ఐదు వేల కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్య అతిథులకి 2 కోట్ల రూపాయల విరువైన వాచీలను ‘రిటర్న్ గిఫ్ట్‌లుగా’ అందించిందట అంబానీ కుటుంబం.
అసలు విషయంలోకి వస్తే, అంబానీ ఇంట జరిగిన పెళ్ళి వేడుకకు హాజరైన పవన్ కళ్యాణ్‌తో పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్‌ని వారంతా ప్రశ్నలతో ముంచెత్తారట. అసలు, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ ఎలా విజయం సాధించింది.? అన్న ప్రశ్నలు పోటెత్తాయట.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ముంబై నుంచి తిరిగొచ్చాక, జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశమయ్యారు.
గెలిచాం.. శతృవులు లేరు, ప్రత్యర్థులు మాత్రమే వుంటారు..
జనసేన నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు (పవన్ కళ్యాణ్‌తో (Jana Sena Party Chief Pawan Kalyan) కలుపుకుని), ఇద్దరు ఎంపీలకు సన్మానం జరిగింది.
సన్మానం చేయించుకోవడానికి పవన్ కళ్యాణ్ మొహమాటపడటం, నవ్వులు పూయించింది. ఆ తర్వాత ఆయన తనదైన స్టయిల్లో ప్రసంగించారు.
Also Read: పోయేకాలం: ముసలాడేగానీ.. ‘మగా’నుభావుడు.!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Konidala Pawan Kalyan) చెప్పారు.
డిప్యూటీ సీఎం హోదాలోనూ, తనకు ప్రభుత్వం తరఫున కల్పించే సౌకర్యాల కోసం రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయించడంలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చపెట్టాలని.. సొంత అవసరాల కోసం అస్సలు వినియోగించకూడదన్న ఇంగితం రాజకీయ నాయకులకు ఖచ్చితంగా వుండాలి.. అదే బాధ్యత అంటే.! ప్రజా సేవ అంటేనే అది.!
Mudra369
‘మనం సాధించింది చాలా గొప్ప విజయం. ఆ విజయం మనలో బాధ్యతను మరింత పెంచాలి. రాజకీయాల్లో శతృవులు వుండకూడదు. మనకు శతృవులు లేరు, ప్రత్యర్థులు మాత్రమే వుంటారు’ అని అన్నారు పవన్ కళ్యాణ్.
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ విషయమై నేషనల్ మీడియా, ‘పొలిటికల్ పవర్ స్టార్’ అంటూ ఆయనకు బిరుదునిచ్చిన సంగతి తెలిసిందే.