Trolling Against Ys Bharathi.. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మీద సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంటుంది.!
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీదా కూడా ట్రోలింగ్ కొత్తేమీ కాదు.
పవన్ కళ్యాణ్ సతీమణి అనా లెజినెవా మీద కూడా ట్రోలింగ్ చేస్తుంటారు కొందరు.! అసలు, రాజకీయ విమర్శల్లోకి మహిళల్ని ఎందుకు లాగాలి.?
రాజకీయాలన్నాక విమర్శలు సహజమే.! ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో రాజకీయాలతో సంబంధం వున్నవాళ్ళపై రాజకీయ విమర్శల్ని చూస్తూనే వున్నాం.
భర్త జగన్ కోసం ఎన్నికల ప్రచారంలో భారతి కనిపిస్తుంటారు. అలానే చంద్రబాబు సతీమణి కూడా.! అనా లెజినెవా మాత్రం, రాజకీయ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు.
అయినాగానీ, అనా లెజినెవా మీద రాజకీయ కోణంలో ట్రోలింగ్ చేస్తుంటారు. వైఎస్ భారతి, సాక్షి మీడియాని నడుపుతుంటారు. సో, ఆమెపైన రాజకీయ విమర్శలు సహజమే.
Trolling Against Ys Bharathi.. రాజకీయ జుగుప్సని సమర్థించడం.. దిగజారుడుతనమే.!
అలాగని, వైఎస్ భారతి మీద దిగజారుడు రాజకీయ విమర్శల్ని ఎవరూ సమర్థించలేరు. కాకపోతే, సోషల్ మీడియా ట్రోలింగ్‌ని అదుపు చేయలేని పరిస్థితి.
వైఎస్ జగన్ అధికారంలో వున్నప్పుడు కూడా, భారతి మీద ట్రోలింగ్‌ని అదుపు చేయలేకపోయారు. అదంతే.
ఓ రాజకీయ ప్రముఖుడు భారతి మీద రాజకీయ విమర్శలు చేస్తే, వైసీపీ అనుకూల మీడియా తీవ్రంగా తప్పు పట్టింది. తప్పు పట్టాల్సిందే కూడా.!
అదే సమయంలో, ముఖ్యమంత్రి హోదాలో వుండి కూడా, ‘పెళ్ళాలు.. కార్లు..’ అంటూ బహిరంగ సభల్లో, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని మహిళలపై వైఎస్ జగన్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యల్నీ ఖండించాలి.
Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!
దారుణమైన విషయమేంటంటే, రాజకీయాల్లో వున్న మహిళలూ, రాజకీయ ప్రత్యర్థులైన మహిళా నేతలపై అత్యంత జుగుప్సాకరమైన పదజాలం వాడుతున్నారు.
అంతెందుకు, విజయమ్మ అలానే వైఎస్ షర్మిల మీద కూడా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మహిళా నేతలున్నారు వైసీపీలో.
రాజకీయ విమర్శ వేరు, జుగుప్సాకరమైన రీతిలో మహిళల్ని కించపర్చడం వేరు. రాజకీయ వ్యవస్థల్లో ప్రక్షాళన జరగాలి. రాజకీయ నాయకులు వాడే పద జాలంలో మార్పు రావాలి.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
