Twitter Bird And DOGE.. అరరె.. ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయిందే.! పోన్లే, ఇకపై ‘రెట్ట’లుండవేమో అనుకునేరు.! కొత్తగా కుక్క వచ్చింది.! అంటే, ఇకపై మరింత అశుద్ధమన్నమాట.!
ట్విట్టర్ గురించి కొత్తగా పరిచయం చేసేదేముంది.? యాపిల్ తర్వాత ఆ స్థాయిలో ట్విట్టర్ పిట్టకి ఫాలోయింగ్ వుందనడం అతిశయోక్తి కాదేమో.! ఆ ట్విట్టర్ పిట్టకి వున్న క్రేజ్ అలాంటిది.
ఏమయ్యిందోగానీ, అనూహ్యంగా పిట్ట ఎగిరిపోయింది.. కుక్క వచ్చిపడింది. ‘మార్పులు సహజం’ అని ట్విట్టర్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనొచ్చుగాక.!
Twitter Bird And DOGE.. చాలా మారింది..
ఔను, ట్విట్టర్ చాలా మారిపోయింది.! డబ్బులు కడితే చాలు, బ్లూ టిక్ వచ్చేస్తోంది. దాంతో, సోషల్ ఛండాలం మరింత ఎక్కువైపోయింది.
సోషల్ మీడియా అంటేనే చెత్త.. అనే అభిప్రాయం బలపడిపోయిందిగానీ, నిజానికి.. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోషల్ మీడియా ఇస్తోన్న షాక్ అంతా ఇంతా కాదు.
పిట్ట పోయి.. కుక్క వచ్చె ఢాం.. ఢాం.. ఢాం.!
ఏ రాయి అయితేనేం.. పళ్ళూడగొట్టుకోడానికి.. ఔను, పిట్ట అయినా.. కుక్క అయినా.. సోషల్ చెత్త విషయంలో మార్పులేమీ వుండవ్.!
సబ్‌స్క్రిప్షన్ పేరుతో అమ్మేసుకుంటున్నాడు.. ఈ కుక్కని ఎవరికి విశ్వాసంగా వుంచుతాడో మరి ఎలాన్ మస్క్.!
ఇది యాపారం.! ఇందులో పద్ధతి, పచ్చడి వంకాయ.. ఏమీ వుండవ్.!
Mudra369
కొద్దో గొప్పో వాస్తవాలు.. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే నిఖార్సుగా అందుబాటులోకి తెస్తోన్నది.. అత్యంత వేగంగా.. సోషల్ మీడియానే.
సినిమాల ప్రచారం కావొచ్చు.. రాజకీయ పార్టీల ప్రచారం కావొచ్చు… ఇతరత్రా వ్యాపారాల ప్రచారం కోసం కావొచ్చు.. సోషల్ మీడియా ఓ అత్యద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతోంది.
Also Read: Nokia Connecting People.! నోకియా అంటే అదొక ఎమోషన్.!
ట్విట్టర్ విషయానికొస్తే, తాను టేకోవర్ చేశాక ‘మంచి మార్పులు’ తెస్తానని చెప్పిన ఎలాన్ మస్క్.. మంచి మార్పుల సంగతి మర్చిపోయి.. ఇదిగో ఇలాంటి ‘భౌ భౌ’ మార్పులతో సరిపెడుతున్నాడన్నమాట.
అన్నట్టు, కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు.! మరి పిట్ట కాస్తా కుక్కగా మారిన దరిమిలా.. ఈ కుక్క ఎవరికి విశ్వాసంగా వుంటుందిట.?