Table of Contents
Uppu Kappurambu Review.. అదో పల్లెటూరు.! ఆ ఊరికి ఒకటే స్మశానం. దశాబ్దాలుగా కాదు, వందల ఏళ్ళుగా.. అందులోనే పాతి పెడుతుంటారు చనిపోయినవారిని.. అదీ, తమ ఊరికి చెందినవారినే.
కాలం గడిచేకొద్దీ, స్మశానంలో స్థలం అయిపోతుంది. అప్పుడేం చేయాలి.? ఇదీ, మెయిన్ ప్లాట్. ఆ ఊరికి పెద్దగా ఓ అమ్మాయి ఎంపికవుతుంది. స్మశాన నిర్వహణని చూసుకునే ఓ కుర్రాడుంటాడు.
తన తల్లి చనిపోతే, పాతి పెట్టడానికీ చోటు లేకపోవడంతో ఆందోళన చెందుతాడు ఆ కుర్రాడు. అతనికి ఆ ఊరి పెద్ద సాయం చేసేందుకు ముందుకొస్తుంది.
మరి, ఊరు ఊరుకుంటుందా.? ఊరిలో పేరు, పలుకుబడి వున్న కుటుంబాలు ఒప్పుకుంటాయా.? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
Uppu Kappurambu Review.. కీర్తి సురేష్, సుహాస్.. తమ భుజస్కందాలపై..
హీరో సుహాస్ ఎంచుకునే సినిమాలు కొత్తగా వుంటాయి. కీర్తి సురేష్ లాంటి స్టార్ ఈ సినిమా చేయడానికి ముందుకు రావడమే ఓ ఆసక్తికరమైన అంశం.
నటన విషయంలో కీర్తి సురేష్ ఎప్పుడూ, ఓ బెంచ్ మార్క్ సెట్ చేసుకుని.. దానికి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంటుంది. సుహాస్ సంగతి సరే సరి.
కాకపోతే, పిచ్చి కామెడీతో సినిమా మొదలై, ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.. చివరికి. అదే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

సినిమా మొదలవుతూనే, కీర్తి సురేష్ నటనని చూసి చిరాకొస్తుంటుంది. అంతలా, పిచ్చి కామెడీ.. పిచ్చెక్కించేస్తుంటుంది. అరవ కామెడీకి ఏమాత్రం తీసిపోదది.
అలా అలా కథ ముందుకు వెళుతున్న కొద్దీ, ఆ పిచ్చి కామెడీ అవసరం ఏంటనేది అర్థమవుతుంది. సినిమా ఎప్పుడైతే ఎమోషనల్ టర్న్ తీసుకుందో, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు.
నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది ‘ఉప్పు కప్పురంబు’ సినిమా. సినిమాటిక్ లిబర్టీ అనొచ్చు.. ఇంకేమైనా అనొచ్చు.. కొన్ని లూప్ హోల్స్ అయితే లేకపోలేదు.
వాళ్ళని సరిగ్గా వాడుకోలేకపోయారు..
వందల ఏళ్ళుగా అదే స్మశానం.. అంటే, ఎంత పెద్ద స్మశానం అయినా, అందులో కొత్తగా ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి ఆస్కారమే వుండదు. వందల ఏళ్ళుగానే ఆ పరిస్తితి వుంటుంది.
స్మశానంలో శిలాఫలకాలకి రంగులు వేయడం.. ఇవన్నీ కొంత రోత పుట్టిస్తాయి. నటీనట్లుల్లో సీనియర్ నటుడు బాబూమోహన్‌ని ఇంకా బాగా వాడుకోవచ్చు. శతృ విషయంలో కూడా అదే జరిగింది.
చాలా సరదాగా.. చాలా క్యాజువల్‌గా సినిమాలో సన్నివేశాలు అలా అలా నడిచిపోతుంటాయ్. ఆ విషయంలో దర్శకుడి పనితనాన్ని మెచ్చుకోవచ్చు.
పెర్ఫామెన్స్ పరంగా, కీర్తి సురేష్‌కి ఫుల్ మార్క్స్. సుహాస్ కూడా అంతే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మాటలు.. ఇలా అన్ని విభాగాలూ, సినిమాకి అవసరమైన మేర బాగానే వర్కవుట్ అయ్యాయి.
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. అదే అడ్వాంటేజ్..
ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ గనుక, చూసేందుకు ఖర్చు లేదు గనుక.. సినిమాని నిస్సందేహంగా, నిరభ్యంతరంగా కాలక్షేపం కోసం సకుటుంబ సమేతంగా చూడొచ్చు.
థియేట్రికల్ రిలీజ్ అయితే, దానికి వేరే లెక్కలుంటాయ్ అనుకోండి.. అది వేరే సంగతి. ఈ సినిమా ఒప్పుకున్నందుకు కీర్తి సురేష్‌ని అభినందించాలి.
కీర్తి సురేష్ బాడీ లాంగ్వేజ్, ఆమె మేకోవర్.. డైలాగ్ డెలివరీ.. వాట్ నాట్.. అన్నీ ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా ఇది కీర్తి సురేష్ సినిమా. ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. అని చెప్పుకోవచ్చు.
మృతదేహాల్ని కొన్ని రోజులపాటు భద్ర పరిచే ప్రక్రియ.. అంటూ హీరో తల్లి చెప్ప ఎపిసోడ్, అంతగా అతికినట్లు లేదు సినిమాలో.
‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు.. చూడ చూడ రుచుల జాడ వేరు.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా..’ అనే పద్యం అందరికీ తెలిసిందే.
ఇంతకీ, ఈ ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో పుణ్య పురుషులెవరు.? ఫిమేల్ సెంట్రిక్ మూవీ కదా.! ఓమో, సుహాస్‌నే ఇక్కడ పుణ్య పురుషుడని అనుకోవాలేమో.!