Table of Contents
Urvashi Rautela Fashion.. ప్రపంచ వింతల్లో ఓ వింత ఏదో ఇలా ఒంటి నిండా బంగారం ధరించి అందంగా మనముందుకొచ్చి నిలబడితే ఎలా వుంటుందో అన్నట్లు లేదూ ఈ ఫోటో చూస్తుంటే. చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. నఖశిఖ పర్యంతం (కేశాల నుండి కాలి గోటి వరకూ) బంగారు వర్ణంతో మెరిసిపోతోంది.
ఇంతకీ ఎవరీ బంగారు ముద్దుగుమ్మ అనేగా మీ డౌటానుమానం. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). ఎందుకిలా ముస్తాబయ్యింది.? అని మాత్రం అడక్కండి. అయినా అదేం చిదంబర రహస్యం కూడా కాదనుకోండి. జస్ట్ ఏ ఫోటో సెషన్. పిక్‌ని కాస్త ఏరి పార చూశారా.? పాప ధరించిన కాస్ట్యూమ్ ఓ బికినీ.
Urvashi Rautela Fashion.. అతిశయం: బికినీ ఇలాక్కూడా ధరిస్తారా.?
సింగిల్ పీస్ బికినీ. డబుల్ పీస్ బికినీ.. రకరకాల డిజైనర్ బికినీలు చూసే వుంటాం. కానీ, ఇక్కడ ఊర్వశీ రౌతెలా ధరించిన బికినీలో ఎక్కడా క్లాత్ అనేదే కనిపించడం లేదు. మొత్తం బంగారంతో ధగ ధగ మెరిసే పూసలతో నిండిపోయింది.
అందుకే, ‘ఆహా.! బ్రహ్మెంత పిసినారీ..’ అంటూ అమ్మాయిల అందాన్ని అప్పుడెప్పుడో ఓ కవిగారు వర్ణించేశారు. అందుకు సాక్ష్యం ఇదిగో నేనే అన్నట్లుంది అమాయకంగా చూస్తూ అందాల ఊర్వశి.
సువర్ణ సుందరి..
ఇక మొత్తం పూసలతో నిండిన ఈ బికినీని కప్పిన ఆ బంగారు పై వస్త్రం ఇంకెంత అదృష్టం చేసుకుందో కదా.. ఈ బికినీలో ఊర్వశి రౌతెలా అందాన్ని వెయ్యి రెట్లు పెంచేసిందది.
Also Read: మాళవికకి మండింది.! మంట పెట్టిందెవరంటే.!
కేశాలను సైతం కప్పేసిన ఆ బంగారు గొలుసులు.. మధ్యలో నల్లగా నిగనిగలాడుతున్న కాటుక కళ్లు.. పువ్వుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం.. అన్నట్లే వున్నాయి. ఇక డ్రస్సుకి పూర్తిగా కాంట్రాస్ట్ పింక్ కలర్‌లో ఆ చేతి గోళ్లు ఊర్వశి అందాల రేటింగులో నేనూ వున్నా.. అంటూ పోటీపడుతున్నాట్లుగా లేవూ.!

రంభ, ఊర్వశి, మేనక.. ముల్లోకాలకీ సుదరాంగులని అంటుంటాం. బహుశా.. ఆ ఊర్వశే ఇదిగో ఇలా భూమ్మీదకు ఊర్వశి రౌతెలా పేరుతో దిగొచ్చిందేమో.! అన్నట్టు ఈ బ్యూటీ తెలుగులో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
లక్కు.. కిక్కు.!
అందాల పోటీలు, అటుపై మోడలింగ్.. అక్కడి నుంచి సినీ రంగ ప్రవేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఊర్వశి రౌతెలా ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అన్నట్టు, డాన్సుల్లో ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) వెరీ వెరీ స్పెషల్. అందుకేనేమో, స్పెషల్ సాంగ్స్ కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తుంటాయ్.
ప్చ్.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన అందం, అభినయం.. అన్నీ వున్నా, లక్కు మాత్రం ఆశించిన మేర కలిసి రావడంలేదు ఈ బంగారు బొమ్మకి. అయితే, లక్కుని తాను నమ్మననీ, కష్టపడితే ఫలితం వస్తుందనీ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పడం ఊర్వశి రౌతెలాకే చెల్లిందేమో.!