Urvashi Rautela Rishabh Pant.. ప్రేమ పేరుతో ఓ అందమైన అమ్మాయి వెంట పడ్డాడట.. కానీ, చివరికి తమ్ముడిగా మిగిలిపోయాడట.! ఏం పాపపు కాలమిది.?
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా, టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య సోషల్ మీడియా వేదికగా ‘వార్’ షురూ అయ్యింది.
ఓ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ ప్రేమ పేరుతో తన వెంట పడుతున్నాడని ఊర్వశి రౌతెలా చెప్పడంతో అసలు కథ మొదలైంది.
ఎక్కడైనా.. అతనికి తెలిసింది ఎటాక్ మాత్రమే.!
నేరుగా రిషబ్ పంత్ పేరుని ఊర్వశి చెప్పలేదుగానీ, ‘ఆర్పీ’ అని పేర్కొంది. దాంతో, రిషబ్ పంత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు.
‘నా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చెయ్యొద్దు.. నన్ను వదిలెయ్ అక్కా..’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు రిషబ్ పంత్.
రిషబ్ పంత్ ఇచ్చిన స్ట్రోక్ దెబ్బకి ఊర్వశి రౌతెలా మైండ్ బ్లాంక్ అయిపోయి వుండాలి. కాస్త తేరుకుని.. తనదైన స్టయిల్లో స్పందించింది ఈ బాలీవుడ్ అందాల భామ.
Urvashi Rautela Rishabh Pant.. బ్యాటింగు సరిగ్గా చెయ్.!
ఏ ఉద్దేశ్యంతో చెప్పిందోగానీ, ‘తమ్ముడూ బ్యాటింగ్ బాగా చెయ్..’ అనేసింది ఊర్వశి రౌతెలా. అంతే కాదు, తనకు చీప్ పబ్లిసిటీ స్టంట్లు అవసరం లేదని కూడా పేర్కొంది.
ముందేమో, ప్రేమ పేరుతో వెంట పడుతున్నట్లు చెప్పి, ఇప్పుడేమో ‘తమ్ముడూ’ అనడంలో ఊర్వశి రౌతెలా ఉద్దేశ్యమేంటబ్బా.?

అది కూడా రాఖీ పండుగ సంబరాల్లో దేశమంతా మునిగివున్న సమయంలో.. ఈ అక్కా తమ్ముళ్ళ ‘బ్యాటింగ్’ రచ్చ అందర్నీ విస్మయానికి గురిచేసింది మరి.!
Also Read: ప్రేమ కథ.. పెళ్ళి వ్యధ.! వెళ్ళిపోమాకె.. నన్నొదిలి.!
నవ్విపోదురు గాక వాళ్ళకేటి.? అన్న చందాన తయారైంది వ్యవహారం. అయినా, ఊర్వశి ఇలా ఎందుకు చేసింది.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
హీరోయిన్ల వలలో క్రికెటర్లు పడటం కొత్తేమీ కాదు. చాలా ఎఫైర్స్, మధ్యలోనే బద్దలైపోతాయ్.! అలా, ఎక్కడో ఈ ఇద్దరికీ ‘వ్యవహారం’ చెడి వుండొచ్చు. అది ‘బ్యాటింగు’కి సంబంధించిన విషయం కాదు కదా.?