Urvashi Rautela మెగాస్టార్ చిరంజీవితో సూపర్బ్ మాస్ సాంగ్ వేసుకుంది ఊర్వశి రౌతెలా.. ‘బాస్ పార్టీ’ అంటూ.! ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఇది.
ఆ ఊర్వశి రౌతెలా, చాలా పద్ధతిగా.. అందమైన చీరకట్టులో వచ్చింది ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్‌మీట్‌కి.
నాలుగేళ్ళ క్రితం తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని చెప్పాననీ, ఆయనతో ఇప్పుడు డాన్స్ చేయడం చాలా ఆనందంగా వుందని ఊర్వశి చెప్పుకొచ్చింది.
Urvashi Rautela.. సూపర్ స్టార్లను చూశా.. మెగాస్టార్ ఎలా అయ్యారో అర్థం చేసుకున్నా..
చాలామంది సూపర్ స్టార్లు అవుతారు.. మెగాస్టార్ అవడం మాత్రం చిరంజీవికే చెల్లింది. అదెలా.? అన్నది ఆయనతో వర్క్ చేసినప్పుడే తెలిసింది.
డాన్స్, గ్రేస్.. చిరంజీవి రూటే సెపరేటు.. చిరంజీవి నుంచి తాను చాలా నేర్చుకున్నా.. అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది.
అయస్కాంతం.. చిరంజీవి మార్కు సెన్సాఫ్ హ్యూమర్
చిరంజీవి గురించి ప్రస్తావించాలంటే, ముందుగా ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పాలి. ఊర్వశి తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో.. ‘అతుక్కుపోయింది.. రావట్లేదు..’ అంటూ చిరంజీవి చేసిన ఫన్ అంతా ఇంతా కాదు.
Also Read: Deepika Padukone.! బేషరమ్.! ఇప్పుడేం చేయాలబ్బా.?
అక్కడితో ఆగలేదు, ‘అయస్కాంతం చేతిలో పెట్టుకుంది.. ఇంకా నయ్యం గుండెల్లో పెట్టుకోలేదు..’ అంటూ చిరంజీవి (Megastar Chiranjeevi)వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులే నవ్వులు.
విషయం ఊర్వశికి అర్థం కాలేదు. ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఆమెకు వివరించి చెప్పాడు.