Ustaad Bhagat Singh FDFS.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ నెల 19న థియేటర్లలో సందడి చేయనుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
ముందుగా ఈ నెల 26న సినిమాని విడుదల చేయాలనుకున్నా, అనూహ్యంగా మార్చి 19న విడుదల.. అంటూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.
‘భవదీయుడు భగత్ సింగ్’గా మొదలైన ఈ ప్రాజెక్ట్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారింది. కోవిడ్ సహా అనేక కారణాలు, ఈ సినిమా ఆలస్యానికి కారణం.
రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన సినిమా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాక విడుదలవుతుండడం మరో ఆసక్తికర అంశం.
Ustaad Bhagat Singh FDFS.. ఈసారి అంతకు మించి..
పవన్ కళ్యాణ్ గత సినిమాలు ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’.. ప్రీ రిలీజ్ హంగామా ఎలా వుందో చూశాం. అంతకు మించిన హంగామాని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో చూస్తున్నాం.
‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ సినిమాలతో పోల్చితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సమ్‌థింగ్ వెరీ స్పెషల్. ఇదొక మాస్ ఎంటర్టైనర్.. పైగా, ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా.
అసలంటూ అంచనాలేవీ లేకుండానే.. సినిమా పూర్తయినా, విడుదలకు వచ్చేసరికి, భారీ అంచనాలు సినిమాపై ఏర్పడ్డాయి.
అనూహ్యంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ప్రీమియర్స్ లేవు. మార్చి 19న నేరుగా థియేటర్లలోకి వస్తోంది. ఏపీలో టిక్కెట్ ధర పెంపుదల వున్నా, తెలంగాణలో లేదు.
వసూళ్ళ ప్రభంజనమే..
ఓ రకంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ఇది అడ్వాంటేజ్.. అనే చర్చ సినీ పరిశ్రమలో నడుస్తోంది. పోటీగా వేరే సినిమాలేమీ లేకపోవడం, ఉగాది, రంజాన్ పండుగల్లో సినిమా వస్తుండడం.. ఇంట్రెస్టింగ్.
సో, ఎలా చూసినా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోతాయ్. తొలి రోజే, 100 కోట్ల వసూళ్ళను ఉస్తాద్ భగత్ సింగ్ సాధిస్తుందన్న చర్చ అంతటా జరుగుతోంది.
Also Read: ఆకాశంలో క్రీడీ మైదానం! ఎడారి దేశంలో అద్భుతం!
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
తమిళ నటుడు పార్తీపన్, మరో తమిళ ప్రముఖుడు కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
