ప్రయోగాలు చేయడంలో హీరో నాని ఎప్పుడూ ముందుంటాడు. అందుకే, ‘నేచురల్ స్టార్’ అనిపించుకుంటున్నాడు. చేసే ప్రతి సినిమా విషయంలోనూ కొత్తదనం కోరుకునే నానికి, అలాంటి ఇంకో హీరో తోడయ్యాడు ‘వి’ సినిమా కోసం. సుధీర్‌బాబు.. టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని మరో మేటి నటుడు. ఈ ఇద్దరూ ‘వి’ (V Movie Nani Sudherbabu) సినిమా కోసం ఇప్పుడు జతకట్టారు.
నిజానికి, మార్చి నెలాఖరున ‘వి’ సినిమా విడుదల కావాల్సి వుంది. కానీ, ‘కరోనా దెబ్బ’ పడింది.. సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారుగానీ.. రోజులు గడిచిపోతున్నాయ్.. నెలలు గడిచిపోతున్నాయ్.. థియేటర్ల పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో చేసేది లేక, ‘వి’ చిత్ర దర్శక నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమయ్యారు.
అమెజాన్ ప్రైమ్ ద్వారా సెప్టెంబర్ 5న సినీ అభిమానుల్ని పలకరించనుంది ‘వి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. బహుశా ‘అంచనాలకు మించి’ అనేది చిన్న మాటేనేమో. భారీ స్థాయిలో సినిమా కోసం ఖర్చుపెట్టినట్లు కన్పిస్తోంది.. ఆ స్థాయిలో ట్రైలర్, సినిమాపై అంచనాల్ని పెంచేసింది మరి.
నాని (Natural Star Nani), సుధీర్ (Sudheerbabu).. ఇద్దరూ నటనలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కెవ్వు కేక. ట్రైలర్ చూస్తోంటే, హాలీవుడ్ యాక్షన్ ఫిలిం అన్న భావన కలిగిందంటే అది అతిశయోక్తి కాదేమో. ఇప్పటిదాకా చూడని కొత్త కోణం హీరో నానిలో మనకు కన్పించబోతోందట. సేవ్‌ు టు సేవ్‌ు సుధీర్‌బాబు విషయంలోనూ అలాగే వుండబోతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
నివేదా థామస్ (Nivetha Thomas) , అదితిరావు హైదరి (Aditi Rao Hydari) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకుడు. ఓటీటీలో ఇప్పటికే టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు ఈ కరోనా సీజన్‌లో విడుదలయ్యాయి. అయితే, ఓటీటీలో రిలీజవుతున్న తొలి పెద్ద సినిమా ‘వి’. దాంతో, ఈ సినిమా ఫలితం ఎలా వుంటుంది.? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఫలితం సంగతి తర్వాత.. ఫస్ట్ డే ఓపెనింగ్స్ హంగామా.. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ హంగామా.. ఇవేవీ లేకుండా.. అసలు సినిమాని ఎలా ఊహించుగలం.? అన్న ఆవేదన అందరిలోనూ వుంది. అన్ని ప్రశ్నలకూ ‘వి’ రిలీజ్‌తో కొంతవరకు సమాధానం దొరకొచ్చని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఇంకో ఆరు నెలల వరకు సినిమా థియేటర్ల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.. ఒకవేళ ఈలోగా ది¸యేటర్లు తెరచుకున్నాగానీ.. మునుపటిలా థియేటర్లకు జనం పోటెత్తే పరిస్థితి వుండదు మరి. ఏదిఏమైనా, ‘వి’ నిజంగానే సెన్సేషనల్ విక్టరీ సొంతం చేసుకోవాలని, తెలుగు సినిమాలో కొత్త జోష్ ఈ సినిమాతో రావాలని ఆశిద్దాం.