Table of Contents
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో 25వ సినిమా ‘వి’ (V Movie Review). అసలు ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడా.? హీరోనేగానీ.. నెగెటివ్ షేడ్స్ చూపించబోతున్నాడా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భావించాడు నాని. మరో యంగ్ హీరో సుధీర్‌బాబు ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించాడు.
కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల మార్చి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సినిమా ది¸యేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేక ఓటీటీ వైపు చూసింది. అయిష్టంగానే ‘వి’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయాల్సి వచ్చింది చిత్ర దర్శక నిర్మాతలకి. మరి, ఈ సినిమా రిజల్ట్ ఏంటి.? రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండిక.
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: నాని, సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ, నివేదా థామస్, నరేష్, వెన్నెల కిషోర్, తలైవాసల్ విజయ్, రోహిణి తదితరులు.
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: పి.జి. విందా
నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: సెప్టెంబర్ 5, 2020 (అమెజాన్ ప్రైమ్ – ఓటీటీ రిలీజ్)
అసలు కథ..
హీరో వరుసగా హత్యలు చేసుకుంటూ వెళుతుంటాడు.. ఆ హత్యలు చేస్తోన్న వ్యక్తిని పట్టుకోడానికి ఓ పోలీస్ అధికారి ప్రయత్నిస్తుంటాడు. ప్రతి హత్యకీ ఓ రేంజ్ వుండాలనుకుంటాడు చంపుతోన్న వ్యక్తి. అలాగే చంపుతాడు కూడా. అత్యంత క్రూరంగా ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
హత్యలు చేయడం వెనుక హీరో ఉద్దేశ్యమేంటి.? అసలు హత్యలు చేస్తున్న వ్యక్తి హీరో కాదు, విలన్ అని అనుకోవాలా? ఈ పాయింట్‌తో చాలా సినిమాలొచ్చినా, ఇది కాస్త స్టయిలిష్ ద్రి¸ల్లర్. ఆ హత్యల్ని ఆపేక్రమంలో హత్యల వెనుక మోటివ్ తెలుసుకుంటాడు పోలీస్ అధికారి. అదేంటన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే..
నేచురల్ స్టార్ నాని స్టయిలిష్‌గా కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఒదిగిపోయాడు. ఓ గెటప్‌లో ఎంత కర్కశంగా కనిపిస్తాడో, ఇంకో గెటప్‌లో అంత కూల్‌గా కనిపిస్తాడు. వన్ మ్యాన్ షో అనేది చిన్న మాటే నానికి సంబంధించినంతవరకు. ఎందుకంటే, ఏ సినిమాలో నాని నటించినా, అందులో ఆ పాత్రే కన్పిస్తుంది.
దటీజ్ నాని. ఇక, సుధీర్‌బాబు పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్‌లో చెలరేగిపోయాడు. హీరోయిన్లలో అటు అదితిరావు హైదరీకి, ఇటు నివేదా థామస్‌కీ తక్కువ ప్రాధాన్యం వున్న పాత్రలే దక్కాయి. వున్నంతలో ఇద్దరూ బాగానే చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
సాంకేతిక వర్గం పని తీరు..
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా వుంటే బావుండనిపిస్తుంది. సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఓవరాల్‌గా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ నుంచి దర్శకుడికి మంచి సపోర్ట్ లభించిందనే చెప్పొచ్చు.
విశ్లేషణ
వెండితెరపై ఈ సినిమాని చూస్తే ఆ ద్రి¸ల్ ఇంకో లెవల్‌లో వుండేదేమో. వేచి వేచి చూసిన సినిమా ఇది. దాంతో, సినిమాపై ఆసక్తి కాస్తా సన్నగిల్లిపోయింది చాలామందికి. కాస్త ఆసక్తితో ఓటీటీలో చూసిన కొంత నిరాశపర్చుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
నాని స్టయిలిష్ యాక్టింగ్, సుధీర్‌బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. ఇవన్నీ ద్రి¸ల్‌కి గురిచేస్తాయి. కొన్ని సీన్స్ ‘ఔరా’ అనిపిస్తే, ఇంకొన్ని సీన్స్ ‘మామూలే కదా’ అనిపిస్తాయి. రెండు దృఢమైన పాత్రల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ని దర్శకుడు ఇంకాస్త బెటర్‌గా చూపించి వుండాల్సింది. దర్శకుడిగా ఏదో ఒక మ్యాజిక్ తన సినిమాలతో చూపించే ఇంద్రగంటి మోహనకృష్ణ, ఈ సినిమాతో కొంత నిరాశపరుస్తాడు. ఓవరాల్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
ఫైనల్ టచ్: ‘వి’ (V Movie Review) – రివెంజ్ రొటీన్, బట్ కొంచెం ద్రి¸ల్లింగ్.!