Vande Bharat Express తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలు వచ్చింది.! ఈ రైలు సేవలు ప్రారంభమయ్యాయి.
విశాఖ – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ రైలు ప్రయాణిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని ‘వందే భారత్’ రైలు సరికొత్తగా అనుసంధానిస్తోంది.. అత్యద్భుతమైన ప్రయాణానుభూతిని ఇస్తోంది కూడా.!
ప్రత్యేక రైళ్ళ పేరుతో సాధారణ రైళ్ళ ద్వారా కూడా అదనపు బాదుడు బాదేస్తున్న ప్రభుత్వాల నుంచి ‘సాధారణ’ ఆలోచనలు ఆలోచనల్ని ఆశించలేం.
Mudra369
కానీ, ఈ వందే భారత్ రైలు వల్ల సామాన్యుడికి ఏంటి లాభం.? దాదాపు 1700 రూపాయల కనీస ఛార్జీతో ఈ రైలులో ప్రయాణించాల్సి వుంటుంది.
Vande Bharat Express వందే భారతం.! సామాన్యుడికేంటి ప్రయోజనం.?
ఏసీ రైలు ప్రయాణం కదా.. పైగా లగ్జరియస్ ప్రయాణం.. ఆ మాత్రం ఖర్చు వుంటుంది. గరిష్ట ధర మూడు వేల రూపాయల పై మాటే.! అయినాగానీ, ఎంజాయ్ చెయ్యాల్సిందే.

బస్సులో ప్రయాణిస్తే.. దాదాపుగా వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతోంది. సో, ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేస్తే సుఖవంతమైన ప్రయాణం.. వేగవంతమైన ప్రయాణం కూడా దక్కుతుంది.
ఫీచర్స్ బాగానే వున్నాయ్.! కానీ, ఈ మార్గంలో సాధారణ రైళ్ళను పెంచితే… అది సామాన్యుడికి లాభం కదా.? పోనీ, రైళ్ళ సంఖ్య పెంచకపోయినా.. సాధారణ భోగీల్ని పెంచితే సామాన్యుడు బాగుపడతాడు కదా.?
కొంచెం సామాన్యుడ్ని కూడా పట్టించుకోవాలి కదా.!
ఇంకా నయ్యం.. అలాంటి ఆలోచనలెందుకు చేస్తాయ్ ప్రభుత్వాలు.? గల్లా పెట్టె నిండాలి. ప్రభుత్వాలు చేస్తోన్నది ప్రజా సేవ కాదు, వ్యాపారం.!
ఖజానా నింపుకోవాలి.. పబ్లిసిటీకి కలిసొచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. ఇదీ ఇటీవలి కాలంలో అదికార పార్టీలు అనుసరిస్తున్న వైఖరి.
Also Read: డేటు మారుద్దంతే.! ఫేటు మారాలంటే మాత్రం.!
ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. వందే భారత్ రైలు గర్వకారణమే.!
కానీ, ప్రయాణీకుల వెతల్ని తీర్చే.. సాధారణ రైళ్ళూ.. వాటిల్లో సాధారణ బెర్తులూ అందుబాటులో వుండాలి.
ప్రత్యేక రైళ్ళ పేరుతో సాధారణ రైళ్ళ ద్వారా కూడా అదనపు బాదుడు బాదేస్తున్న ప్రభుత్వాల నుంచి ‘సాధారణ’ ఆలోచనలు ఆలోచనల్ని ఆశించలేం.