Varuntej Lavanya Tripathi Engagement.. సస్పెన్స్ వీడింది.! ఐదేళ్ళ ప్రేమ.. మూడు ముళ్ళ బంధం వైపుగా అడుగులేస్తోంది. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. పెళ్ళెప్పుడన్నది తేలాల్సి వుంది.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్.. ఈ ఇద్దరి మధ్యా గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలో ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారన్న ప్రచారం కొన్నాళ్ళుగా జరుగుతోంది. ‘నాకా.? అప్పుడే పెళ్ళా.? నేనెవరితోనూ ప్రేమలో లేను..’ అని చెబుతూ వచ్చింది లావణ్య నిన్న మొన్నటిదాకా.
Varuntej Lavanya Tripathi Engagement.. గాసిప్స్‌కి ఛాన్స్ లేదిక..
నిన్న మొన్నటిదాకా గాసిప్స్ మాత్రమే.. ఇప్పుడు ఈ ఇద్దరూ ఎంగేజ్డ్.! సో, గాసిప్స్‌కి అవకాశం లేదు, వీరి ప్రేమకు సంబంధించి.

అత్యంత సన్నిహితుల విషెస్ నడుమ, నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్ – లావణ్యల (Varun Tej Lavanya Tripathi) ఎంగేజ్మెంట్ జరిగింది.
చిరంజీవి (Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మెగా కాంపౌండ్ అంతా.. ఈ వేడుకలో సందడి చేశారు.
ఇంతకీ పెళ్ళెప్పుడు.?
ఈ ఏడాది చివర్లో వరుణ్ – లావణ్యల (Varun Tej Konidela Lavanya Tripathi) పెళ్ళి జరగబోతోందిట.! ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
Also Read: అన్న దిగిండు.! ‘భగవంత్ కేసరి’గా బాలయ్య.!
నిన్న ఎంగేజ్మెంట్.. అంటూ ప్రచారమైతే జరిగిందిగానీ, సాయంత్రం వరకు ఆ సందడి ఎక్కడా కనిపించలేదు.

వరుణ్ (Konidela Varun Tej), లావణ్య (Lavanya Tripathi).. ఎంగేజ్మెంట్ తర్వాత.. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.