Varuntej Lavanya Wedding OTT వివాహ వేడుక.. వధూ వరులకే కాదు, ఇరువురి కుటుంబ సభ్యులకీ చాలా చాలా ప్రత్యేకమైనది.! సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఇది ప్రత్యేకమే కదా.!
సామాన్యులది సాధారణ పెళ్ళి వేడుక అయితే, సెలబ్రిటీలది అత్యంత ఖరీదైన పెళ్ళి వేడుక.! అంతే తేడా.!
గత కొంతకాలంగా సెలబ్రిటీలు కొందరు తమ వివాహ వేడుకని, ఓ ఈవెంట్ తరహాలో జరుపుకుంటుండడం చూస్తున్నాం.
సహజంగానే, ఇలాంటి ఈవెంట్లను స్పాన్సర్ చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తుంటాయ్. వాటికి అనుమతి ఇవ్వాలా.? వద్దా.? అన్నది ఆయా సెలబ్రిటీల ఛాయిస్.
కొందరు అలా.. అందరూ అలాగే అంటే ఎలా.?
కొందరు, తమ వివాహ వేడుకని ఈవెంట్‌లా నిర్వహించి, వాటి ప్రసార హక్కుుల్ని ఓటీటీకి అమ్మేసుకోవడం ఈ మధ్య చూస్తున్నాం.
నిజానికి, దీన్ని తప్పు పట్టలేం కూడా.! ఎవరిష్టం వారిది.! ఓ పెళ్ళి అలా జరిగింది కదా.. అని, అన్ని పెళ్ళిళ్ళకీ.. అదే ఆపాదించేస్తే ఎలా.?

టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య.. ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్ళి ఇటలీలో అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.
Varuntej Lavanya Wedding OTT.. 8 కోట్లు.. నిజమెంత.?
ఈ వేడుక తాలూకు ప్రసార హక్కుల్ని వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నెట్‌ఫ్లిక్స్ సంస్థకి అమ్మేసుకున్నారనీ, డీల్ విలువ 8 కోట్లకు పై మాటేననీ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.
అయితే, ఈ గాసిప్స్‌ని లావణ్య త్రిపాఠి ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘పెళ్ళి వేడుక అమ్మకానికి’ అనే ప్రచారం దారుణమని లావణ్య త్రిపాఠి అభిప్రాయపడింది.
Also Read: విక్రమ్ ‘తంగలాన్’.! ఇలా అయిపోయాడేంటి.?
చివరగా.. వార్తల్ని ఎలాగోలా అమ్మేసుకోవాలనుకునే పాత్రికేయ వ్యభిచారులకి.. అందరిమీదా గాసిప్స్ పుట్టించడం అనేది ఓ మానసిక రుగ్మత. అదో పైశాచిక ఆనందం.!
అయినా, ఇటీవలి కాలంలో మీడియా ఎందుకు ఇంతలా దిగజారిపోతోంది.? ఈ కక్కుర్తికి కారణమేంటి.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా తయారైంది.!