Veera Simha Reddy.. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు ‘వీర సింహా రెడ్డి’.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద ‘మాస్ జాతర’ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అభిమానుల హంగామా వేరే లెవల్‌లో కనిపిస్తోంది.
ఇంతకీ, ‘వీర సింహా రెడ్డి’ ఎలా వుంది.? ఫస్ట్ డే ఫస్ట్ షో వివరాల్ని బట్టి చూస్తే, అభిమానుల్ని బాలయ్య ఉర్రూతలూగించినట్లే కనిపిస్తోంది.
Veera Simha Reddy బాలయ్య మాస్ హీరోయిజం..
హీరోని ఎలివేట్ చేయడంలో గోపీచంద్ మలినేని తన మార్క్ చూపించాడు. ఫస్టాఫ్‌లో మాస్ జాతరేనన్నది మెజార్టీ అభిప్రాయం.
అయితే, సెకెండాఫ్‌లో సెంటిమెంట్ ఎక్కువైపోవడంతో, కాస్త పేస్ తగ్గింది. సినిమా నిడివి కూడా ఒకింత ఇబ్బందికరంగా మారింది.
ఫస్టాఫ్‌లో ఊపుని, రెండో సగంలోనూ కొనసాగించి వుంటే సినిమా రిజల్ట్ వేరే లెవల్‌లో వుండేదని అభిమానులే అంటున్నారు.
Also Read: తిన్నారు.! తిడుతున్నారు.! రోజాపై చిరంజీవి అసహనం.!
ఫ్యాన్స్ హంగామా నడుమ, అసలు రిజల్ట్ ఏంటన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కాస్సేపాగితే, జనరల్ పబ్లిక్ థియేటర్లలో బొమ్మ చూశాక వ్యక్తం చేసే అభిప్రాయాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి వుంటుంది.
సంక్రాంతి కలిసొస్తుందా.?
ఓవరాల్‌గా చూస్తే, ఇది సంక్రాంతి సీజన్ గనుక.. బాలయ్య తన అభిమానుల్ని అలరించే సినిమా చేశాడన్న టాక్ వినిపిస్తోంది గనుక.. ఈ నాలుగైదు రోజులూ వసూళ్ళ జాతరకు లోటుండకపోవచ్చు.
సాంగ్స్ మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తుండడం.. ఫైట్స్, డైలాగ్స్ వేరే లెవల్‌లో వుండడం.. ఇవన్నీ బాలయ్య అభిమానులు, మాస్ ఆడియన్స్ ‘రిపీట్ మోడ్’లో సినిమా చూసేందుకు ఆస్కారముంది.
కంప్లీట్ రివ్యూ.. కాస్సేపట్లో.!