Vijay Antony Accident.. యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త వచ్చినా.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలిసినా.. ఇక అంతే.. వాళ్లు చచ్చినట్లే. అదేనండీ వార్తల్లో చంపేస్తారు మరి.
ఇదో ట్రెండ్ అయిపోయిందప్పుడు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొన్ని మీడియా ఛానెళ్ల అత్యుత్సాహం అలా వుంది మరి.
మొన్నా మధ్య తమిళ నటుడు విక్రమ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఇంకేముంది విక్రమ్ బతకడం కష్టమే అనేశారు.
సెలబ్రిటీల్ని చంపెయ్యడమంటే మీడియాకి ఎంత సరదానో.!
తమ కుటుంబ సభ్యుల విషయంలో ఇలాంటి తుత్తరపాటు ప్రచారం జరిగితే ఎంత బాధపడతాం.? అన్న సోయ లేకుండా దుష్ప్రచారాలు చేసెయ్యడం సర్వసాధారణమైపోయింది.!
ఇదొక జాడ్యం.! దీనికి మందు లేదు. చికిత్స అసలే లేదు. క్యాన్సర్ కంటే దారుణమైనది ఈ రోగం.
Mudra369
అలాగే విశ్వనుటుడు కమల్ హాసన్ ఆరోగ్యం విషయంలోనూ మీడియా అదే తుత్తరపాటు.
కొద్ది రోజుల క్రితం స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చేరితే, ఏకంగా గుండెపోటు అనీ.. పరిస్థితి విషమం అనీ మీడియాలో వార్తలొచ్చాయ్.
తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీని (బిచ్చగాడు ఫేమ్) అలాగే చంపేశారు.. వార్తల్లో.!
Vijay Antony Accident.. ‘బిచ్చగాడు’ హీరోని చంపేశారే.!
ఇటీవల షూటింగ్‌లో యాక్సిడెంట్ కారణంగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ ఆంటోనీని మీడియా సాక్షిగా చంపేశారు.

దాంతో, తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి ఓ ఫోటో రిలీజ్ చేసి, నేనింకా చావలేదురా.. బతికే వున్నాను..’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అనూహ్యంగా షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ఆయనకు గాయాలయ్యాయ్.
Also Read: Sapthami Gowda.. ‘కాంతా.! రా.!’ రమ్మంటున్నారు.!
మేజర్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పోస్ట్ ద్వారా తన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారాయన.
నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగొచ్చేస్తుందట. ఇది వెనకటికి పెద్దలు చెప్పిన మాట. కానీ, ఇప్పుడు నిజం.. గడప దాటేలోపు.. అబద్ధం ప్రపంచమంతా తిరిగొచ్చేస్తోంది. సోషల్ మీడియా యుగం ఇది మరి.!