Vijay deverakonda 1Cr Kushi.. మొత్తం కోటి రూపాయలు.! మొత్తంగా వంద మందికి.! అంటే, ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున అన్నమాట.!
నిజమే, విజయ్ దేవరకొండ అంటే బంగారు కొండే.! ఎవరన్నా ఏమన్నా అనుకోండి. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ప్రదర్శించే రౌడీయిజం.. అనగా, అదో టైపు ఎగ్రెషన్.! ఏదైనా కావొచ్చు.
విజయ్ దేవరకొండ నిజంగానే బంగారు కొండ.! ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. సేవా కార్యక్రమాలు విజయ్ దేవరకొండకి కొత్తేమీ కాదు.
Vijay deverakonda 1Cr Kushi.. కోవిడ్ కష్ట కాలంలోనూ.!
కోవిడ్ కష్ట కాలంలో, పేదల్ని ఆదుకునేందుకు విజయ్ దేవరకొండ తనదైన ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఈ విషయమై నానా రకాల విమర్శలూ చేశారు కొందరు.. అదీ అర్థం పర్థం లేకుండా.
కానీ, విజయ్ దేవరకొండ సాయం చాలామందికి పనికొచ్చింది. చాలా జీవితాలు లాక్ డౌన్ సమయంలో ఊపిరి పీల్చుకున్నాయి.
ఇప్పుడు, తన తాజా చిత్రం ‘ఖుషి’ మంచి విజయాన్ని అందుకోవడంతో విజయ్ దేవరకొండ, తన సంపాదన నుంచి కోటి రూపాయల్ని, వంద మందికి పంచాలని నిర్ణయించుకున్నాడు.

టాక్‌తో సంబంధం లేకుండా, ‘ఖుషి’ సినిమా మంచి వసూళ్ళనే రాబట్టడం గమనార్హం. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
తాజాగా, బిగ్ బాస్ రియాల్టీ షో, సీజన్ బిగినింగ్ ఎపిసోడ్‌లో వేదికపై సందడి చేసిన విజయ్ దేవరకొండ, ‘ఖుషి’ సక్సెస్ సంబరాలు.. అనడం కంటే, రిలీఫ్ ఫీల్ అవుతున్నానని చెప్పడం గమనార్హం.
కొండంత సాయం..
నిజమే, ‘లైగర్’ లాంటి డిజాస్టర్ తర్వాత, విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అయిన సినిమా ఈ ‘ఖుషి’.
సక్సెస్ కోసం ఎంతలా ఎదురు చూశాడో, ‘ఖుషి’ విజయోత్సవ వేడుకలో, వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున, కోటి రూపాయల సాయం ప్రకటించడంతోనే నిరూపించాడు.
తన ఆనందాన్ని, ఆ వంద కుటుంబాలతో కలిసి పంచుకోవాలనుకుంటున్న విజయ్ దేవరకొండని అభినందించకుండా వుండలేం.
Also Read: భగవంత్ కేసరి Ganesh Anthem: చిచ్చా, బేటా.. కుమ్మేశారు.!
ఖచ్చితంగా, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కుటుంబాలకే విజయ్ దేవరకొండ సాయం అందుతుందని చెప్పొచ్చు. అలా చూస్తే, ఆ వంద కుటుంబాలు విజయ్ దేవరకొండకి రుణపడి వుంటాయ్.!
సినీ పరిశ్రమ తరఫున నటులు, దర్శక నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేస్తూనే వుంటారు.. విపత్తుల సమయంలోనూ, ఇతరత్రా సందర్భాల్లోనూ.!
సామాజిక బాధ్యత విషయంలో సినీ పరిశ్రమ తర్వాతే ఇంకేదైనా.!