Vijay Deverakonda Jana Gana Mana: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జనగనమన’ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌లతో కలిసి వంశీ పైడిపల్లి నిర్మిస్తుండడం గమనార్హం. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా.!
విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అప్పుడే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించేశారు.
నిజానికి, పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘లైగర్’ (LIGER Movie) సినిమానే ఇంకా విడుదల కాలేదు.! ఈలోగా కొత్త సినిమా గురించిన ప్రకటన, దాని రిలీజ్ డేట్ అనౌన్సమెంట్.! దటీజ్ పూరి.
అన్నట్టు, ‘జనగనమన’ వెనుక చాలా పెద్ద కథ వుంది. అప్పుడెప్పుడో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘వందేమాతరం’ పేరుతో సినిమా వస్తుందంటూ ప్రచారం జరిగితే, అచ్చం అలానే పూరి నుంచి ‘జనగనమన’ సినిమా గురించిన ప్రచారమూ జరిగింది.
పవన్ కళ్యాణ్ హీరోగా ‘సత్యాగ్రహి’ అనే సినిమా గురించిన కూడా అప్పట్లో ఇలాగే వార్తలొచ్చాయి. ‘వందేమాతరం’ సెట్స్ మీదకు వెళ్ళలేదు, ‘సత్యాగ్రహి’ సంగతి ఇప్పటికీ తేలలేదు. కానీ, ‘జనగనమన’ మాత్రం ముందుకు కదిలింది ఇన్నేళ్ళకి.
Vijay Deverkonda Jana Gana Mana ఇస్మార్ట్ అంతే.!
అయితే, మహేష్‌బాబుతో తెరకెక్కించాల్సిన ‘జనగనమన’ కాస్తా, ఇప్పుడు విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) తెరకెక్కిస్తున్నాడు ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.
ఆ మధ్య ఇదే సినిమా విషయమై కన్నడ హీరో యష్‌తో కూడా పూరి సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయ్.. కానీ, అవేవీ నిజం కాలేదు.
ఇంతకీ, పూరి ‘జనగనమన’ ప్రకటన చేసింది, ‘లైగర్’ మీద హైప్ పెంచడానికేనా.? నిజంగానే, ‘జనగనమన’ సినిమాని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తాడా.?
Also Read: Shruti Haasan పెళ్ళయిపోయిందట కానీ.!
కోవిడ్ భయాలు ఇప్పుడేమీ లేవు గనుక, పూరి సినిమాల్ని వేగంగా తీసేస్తాడు గనుక.. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’, వచ్చే ఏడాది ఆగస్టులో ‘జనగనమన’ ఎలాంటి అనుమానాల్లేకుండా చూసెయ్యొచ్చు.
ప్చ్.. ఆ కాంబో అటకెక్కేసింది.!
మహేష్‌బాబుతో (Super Star Maheshbabu) ‘జనగనమన’ (Jana Gana Mana) సినిమాకి సంబంధించి పూరి చాలా ఆశలే పెట్టుకున్నాడు. చేస్తే అది కేవలం మహేష్‌తోనే చెయ్యాలని పలు సందర్భాల్లో చెప్పాడు.
ఈ మేరకు అప్పట్లో ఓ పోస్టర్ లాంటిది సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు కూడా పూరి జగన్నాథ్ (Puri Jagannadh). కానీ, మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడం గమనార్హం.
దాంతో ఇక మహేష్ కోసం ఎదురు చూడటం దండగనే నిర్ణయానికి వచ్చి పూరి ఇలా విజయ్ దేవరకొండతో కమిట్ (Vijay Deverakonda Jana Gana Mana) అయిపోయాడని అనుకోవాలేమో. మహేష్ ఇలా వదిలేసుకున్న సినిమాల లిస్టు చాలా పెద్దదే వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.