Vijay Deverakonda Kingdom Postponed.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘హరి హర వీర మల్లు’ ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూనే వుంది.. ఎట్టకేలకు, షూటింగ్ ముగిసింది.!
ఇంతకీ, ‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్ ఎప్పుడు.? అదెప్పుడన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయ్.!
‘హరి హర వీర మల్లు’ సినిమా పంచాయితీ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ సినిమా ‘కింగ్‌డమ్’ పరిస్థితి కూడా అంతే. విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘కింగ్‌డమ్’.
ఓ సినిమా వాయిదా పడితే, దాని ఇంపాక్ట్ మరో సినిమా పడుతోంది. ఈ క్రమంలోనే, ‘హరి హర వీర మల్లు’ కారణంగానే, ‘కింగ్‌డమ్’ వాయిదా పడిందని అనుకోవాలా.?
Vijay Deverakonda Kingdom Postponed// హరి హర వీర మల్లు అలా.. ‘కింగ్‌డమ్’ ఇలా..
గత సంక్రాంతికే ‘హరి హర వీర మల్లు’ సినిమా వస్తుందని అనుకున్నారంతా. కుదరలేదు. ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికే అనుకున్నారు, అదీ వెనక్కి వెళ్ళింది.
వెనక్కి వెళ్ళడం.. అంటే, కొన్ని సినిమాల ఆలస్యం.. నెలల తరబడి అవుతోంది. అదే అసలు సమస్య. ఓటీటీ డీల్స్ కూడా, సినిమా రిలీజులపై ప్రభావం చూపుతున్నాయి.

సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలన్నది కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఏంటన్నది అర్థమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, జులై 4న ‘కింగ్‌డమ్’ సినిమా విడుదల కానుందట. నమ్మొచ్చా.? అని మాత్రం అనకూడదు. అప్పటిదాకా వేచి చూడటమే.
Also Read: Good Bad Ugly Review: డిజాస్టర్ ‘సుడిగాడు’.!
ఈ లోగా, ఇంకేమన్నా ఈక్వేషన్లు మారితే, విజయ్ దేవరకొండ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చునేమో.!
‘విశ్వంభర’ కావొచ్చు, ‘హరి హర వీర మల్లు’ కావొచ్చు, మరో సినిమా కావొచ్చు.. ఇలా సినిమాలు వాయిదాలు పడుతుండడంతో, దర్శకుల కెరీర్ కూడా అయోమయంలో పడిపోతోంది.
నిర్మాతల కష్టాల సంగతి సరే సరి.! హీరోల స్టార్‌డమ్ కూడా గందరగోళంగా తయారవుతోంది.