Vijay Deverakonda Rashmika Mythri.. అసలు విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న మధ్య ఏం జరుగుతోంది.? అసలేం జరగాలని.?
విజయ్ దేవరకొండ, రష్మిక.. కో-స్టార్స్.! ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. అలా, ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది.!
రష్మిక, విజయ్.. చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారంటూ గుసగుసలు చాలాకాలంగా వినిపిస్తున్నవే. అయితే ఏంటట.?
Vijay Deverakonda Rashmika Mythri.. ఇంకోస్సారి..
విజయ్, రష్మిక కాంబినేషన్లో.. హిట్టు సినిమాలున్నాయి.. ఫట్టు సినిమాలూ వున్నాయ్. సినిమా అన్నాక హిట్టూ ఫట్టూ మామూలే కదా.!
తాజాగా, ఈ ఇద్దరి కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ కాబోతోంది. రాహుల్ సంక్రితియాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.

అటు రష్మిక, ఇటు విజయ్.. ఇద్దరూ ప్రస్తుతానికి తమ తమ సినిమాలతో బిజీగా వున్నారు. విజయ్ దేవరకొండ నుంచి ‘కింగ్‌డమ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్ రష్మిక మండన్న విషయానికొస్తే, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల్నీ చక్కబెట్టేస్తోంది.. అక్కడా, ఇక్కడా తనదైన స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీ అవుతుందని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!