Virupaksha Niharika Konidela.. కొణిదెల నిహారిక.. ఈ పేరు గత కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతోంది సోషల్ మీడియా వేదికగా.
విడాకుల ప్రచారం ఓ వైపు.. నిహారిక (Niharika Konidela) ఫొటోలు ఇంకో వైపు.. వెరసి నిహారికని వివాదాల్లోకి లాగుతూనే వున్నారు. నిహారిక మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.! ఆ పోస్ట్ కూడా ‘విరూపాక్ష’ (Virupaksha) గురించి కావడం గమనార్హం.
Virupaksha Niharika Konidela.. బావా.. నీ కోసమే.!
నిహారికకి సాయి ధరమ్ తేజ్ బావ అవుతాడు. మేనత్త కొడుకు మరి.! సాయి ధరమ్ తేజ్‌కి (Sai Dharam Tej) మేనమామ (నాగబాబు కుమార్తె) నిహారిక.!

ఇక, ‘విరూపాక్ష’ (Virupaksha Movie) సినిమా హర్రర్ మూవీ.! నిహారికకేమో దెయ్యాల సినిమాలంటే భయమట. అయినాగానీ, ‘విరూపాక్ష’ సినిమా చూసిందట.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది నిహారిక కొణిదెల (Niharika Konidela). అద్గదీ అసలు సంగతి.!
Also Read: ఎన్టీయార్ కోసం సైఫ్ అలీఖాన్ వచ్చేశాడు.!
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమాకి హిట్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్.