Visakha Google Data Center Jagan.. విశాఖలో గూగుల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం సహజంగానే, గూగుల్ సంస్థకి కొన్ని రాయితీలను ఆఫర్ చేసింది. చెయ్యాలి కూడా.!
పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలంటే, ఏ రాష్ట్రమైనా రాయితీలు ఇవ్వాల్సిందే. ఆయా సంస్థలకు అదనపు సౌకర్యాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్పించాల్సిందే.
ఎవరు అధికారంలో వున్నా సరే.. ఇది తప్పనిసరి. అలా చేస్తేనే కదా, పెట్టుబడులు వచ్చేది. పారిశ్రామిక వేత్తలు, తమ వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకునేది.
తద్వారా, ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. కానీ, ఈపాటి జ్ఞానం వైసీపీ శ్రేణులకు లేకుండా పోయింది.
Visakha Google Data Center Jagan.. డేటా సెంటర్‌తో లాభమా.? నష్టమా.?
డేటా సెంటర్ వల్ల నష్టమే తప్ప, లాభం లేదంటూ వైసీపీ శ్రేణులు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున దుష్ప్రచారం మొదలు పెట్టాయి.
పెద్ద మొత్తంలో నీటిని, డేటా సెంటర్ కోసం వెచ్చించాల్సి వుంటుందనీ, విశాఖలో తాగు నీటి సమస్య వచ్చేస్తుందనీ.. ఏవేవో దుష్ప్రచారాలు మొదలు పెట్టారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.
చిత్రంగా గూగుల్ డేటా సెంటర్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేందుకు కూడా వైసీపీ శ్రేణులు సమాయత్తమయిపోయాయి.
ఇంతలోనే, వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదే ట్విస్ట్ అంటే.! డేటా సెంటర్ వల్ల ప్రయోజనాల గురించి వివరించారు వైఎస్ జగన్, ప్రెస్ మీట్లో.
Also Read: మీ టూత్ పేస్టులో ‘క్యాన్సర్’ వుందా.?
తమ హయాంలోనూ డేటా సెంటర్‌కి అనుకూలంగా చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పుకొచ్చారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ని స్వాగతిస్తున్నట్లు కూడా జగన్ ప్రకటించేశారు.
దాంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్‌కి గురయ్యాయి. జగన్ వైసీపీని నిండా ముంచేశారా.? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతోందిప్పుడు.
రాజకీయాల్లో విమర్శలు సహజం. కాకపోతే, అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలు, నాయకులు.. హుందాతనంతో వ్యవహరించాలి.
రాజకీయమంటే ప్రజా సేవ.. ఆ ప్రజా సేవే పరమావధిగా రాజకీయాలు చేస్తే, అది రాజకీయ నాయకులకే మంచిది.
