Vishal Mark Antony Postponed.. విశాల్ హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
ఈ నెల 15న ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
న్యాయపరమైన వివాదాల కారణంగా సినిమా (Mark Anthony) ఈ నెల 15న విడుదలయ్యేందుకు అవకాశాలు కన్పించడంలేదని కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం అందుతోంది.
Vishal Mark Antony Postponed.. న్యాయస్థానం స్టే విధించిందా.?
సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించిందన్నది ఆ సమాచారం తాలూకు సారాంశం. అయితే, ఈ విషయమై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.
విశాల్ (Vishal) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మితమయ్యిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
వివాదం ఏంటన్నది తెలియరాలేదుగానీ, ఈ నెల 12న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణ జరపనున్నట్లు సమాచారం.
కాగా, ‘మార్క్ ఆంటోనీ’ టీమ్ మాత్రం, సినిమా ప్రమోషన్లను యధాతథంగా కొనసాగిస్తోంది.
అయ్యో పాపం మార్క్ ఆంటోనీ.!
ఇదిలా వుంటే, ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) గనుక వాయిదా పడితే, సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశాలున్నాయి.
అదే రోజున.. అంటే, సెప్టెంబర్ 28న లారెన్స్ సినిమా ‘చంద్రముఖి-2’ (Chandramukhi2) కూడా విడుదలవుతోంది. లారెన్స్ సరసన కంగనా రనౌత్ ఈ సినిమాలో నటించింది.
నిజానికి, ‘చంద్రముఖి-2’ కూడా, గ్రాఫిక్స్ వర్క్ సంబంధిత ఇబ్బందులతో, సెప్టెంబర్ 28కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Also Read: చచ్చేది ఒక్కసారే.! ఎవరికైనా తప్పదది.!
‘మార్క్ ఆంటోనీ’ వాయిదాపై చిత్ర యూనిట్ స్పందించాల్సి వుంది. అసలే ఈ మధ్య విశాల్ మార్కెట్ గణనీయంగా పడిపోయింది.
ఇప్పుడీ వాయిదాల ప్రచారంతో, సినిమాపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. తెలుగునాట అయితే, జీరో బజ్‌తో ‘మార్క్ ఆంటోనీ’ విడుదలవ్వాల్సిన పరిస్థితి.
అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. వినోద్ కుమార్ ఈ ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించారు.