Vishwak Sen Mass Ka Das.. న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ ‘ఎఫ్’ పదం వాడటం తప్పా.? ఒప్పా.? ఎవరూ దీన్ని ‘ఒప్పు’ అనరు. విశ్వక్ సేన్ కూడా, ఏదో బాధలో అలా అనేశా.. అలా అనకుండా వుండాల్సింది.. క్షమాపణ చెబుతున్నానని కూడా అన్నాడు.
సో, ఇక్కడితో వివాదం ముగిసిపోయినట్లేనా.? అంటే, కానే కాదట. సదరు టీవీ ఛానల్, విశ్వక్ సేన్‌ని సినిమాల నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అన్నట్టు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల దగ్గరకు వెళుతున్నారు సదరు ఛానల్ ప్రతినిథులు.
‘తగ్గేదే లేదు.. విశ్వక్ సేన్ సినిమాలు ఆడనివ్వం.. అతను సినిమాలు చేస్తే ఊరుకునేది లేదు..’ అంటూ కొందరు రాజకీయ నాయకులు ప్రకటనలూ చేసేస్తున్నారు.
Vishwak Sen Mass Ka Das.. గుర్తింపు ఇలా పెరుగుతోందన్నమాట.!
విశ్వక్ సేన్‌ని (Vishwak Sen) అసలు హీరోగానే తాము గుర్తించడం లేదంటాడు ఓ పొలిటీషియన్. రాజకీయ నాయకులు, సినిమా హీరోల్ని గుర్తిస్తారా.? గుర్తించరా.? గుర్తిస్తే ఏంటి లాభం.? గుర్తించకపోతే ఏంటి నష్టం.? అనేది మళ్ళీ వేరే చర్చ.
తన తాజా సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కి (Ashoka Vanamlo Arjuna Kalyanam) విపరీతమైన పబ్లిసిటీ అయితే తెచ్చేసుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
‘ప్రతి సినిమా విషయంలోనూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వుంటాను.. చెయ్యాలి కూడా.. అది నా బాధ్యత..’ అని విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేల్చేశాడు.
విశ్వక్ సేన్‌కి వచ్చిన నష్టమేంటి.?
అయినా, మీడియా సంస్థలు.. సినిమా హీరోల్ని బ్యాన్ చేస్తే.. ఆయా హీరోలకు వచ్చే నష్టమేముంది.?
సినిమా హీరోల మీదా, హీరోయిన్ల మీదా అడ్డమైన రాతలూ రాసి, తారల వ్యక్తిగత జీవితాలోకి తొంగి చూసి, గాసిప్పులు ప్రచారం చేసుకునే న్యూస్ ఛానళ్ళు.. ఇప్పుడు నీతులు మాట్లాడుంతోంటే, వినడానికే అసహస్యంగా వుందన్నది మెజార్టీ అభిప్రాయం.
విశ్వక్ సేన్ అప్‌కమింగ్ హీరో. స్టార్ హీరో అయితే కాదు. అలాంటి స్టార్ హీరోని చూసి న్యూస్ ఛానల్ ఇంతలా రాద్ధాంతం చేస్తుండడం ఆశ్చర్యకరమే.
సినిమా హీరోగా తన సినిమా పబ్లిసిటీ కోసం ప్రాంక్ చేసిన విశ్వక్ సేన్, ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్‌కి పబ్లిసిటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడన్నమాట.
Also Read: కాజల్ అగర్వాల్‌కి ఎందుకంత అన్యాయం చేశారు.?
దురదృష్టమేంటంటే, ఆ ఛానల్.. విశ్వక్ సేన్ పేరుతో పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడటం. ఒకప్పుడు నెంబర్ వన్ ఛానల్.. ఇప్పుడు రేటింగ్స్ పడిపోవడంతో.. ఇలా అడ్డదారులు తొక్కుతోందన్నమాట.. అనేది విశ్వక్ సేన్ అభిమానుల ఆరోపణ.